అంబర్ పేట అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని... ముఖ్యమంత్రి గా కేసీఆర్ మూడో సారి గెలుపు కాయమని అంబర్పేట్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు . కాచిగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి చప్పా ల్ బజార్, మోతిలాల్ నెహ్రూ నగర్ లలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ కాచిగూడ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే ఇప్పుడు మనకు అందుతున్నాయని విూరు మళ్లీ అంబర్పేట్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలేరు వెంకటేష్ కోరారు.
అందరికి అందుతున్న సంక్షేమ పథకాలు
సోమవారం, అక్టోబర్ 30, 2023
0
Tags