Ticker

6/recent/ticker-posts

Ad Code

శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలి

మంథని అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ );రాజకీయ పార్టీ నేతలు తహసిల్దార్ల సమావేశంలో ఆర్డీవో హనుమా నాయక్‌  

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని మంథని రెవెన్యూ డివిజనల్‌ అధికారి హనుమా నాయక్‌ అన్నారు.బుధవారం ఆర్డీవో కార్యాలయంలో మంథని ఆర్డిఓ హనుమా నాయక్‌ మంథని నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్‌ కవిూషన్‌ మరియు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, తెలంగాణా, హైదరాబాదు  ఆదేశాల మేరకు ఈ రోజు మంథని నియోజకవర్గం లోని 288 పోలింగ్‌ కేంద్రాలలో ప్రతీ బి.ఎల్‌.ఓ  ద్వారా ఓటర్ల జాబితాను పబ్లికేషన్‌ చేయడం జరిగింది అని తెలిపారు, అంతే కాకుండా ఇట్టి ఓటర్ల తుది జాబితాను, మంథని నియోజకవర్గం లోని (10) మండల తహసిల్దారు కార్యాలయము లలో కూడా ఓటర్ల పరిశీలన నిమిత్తం అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. అంతే కాకుండా, ప్రతీ బి.ఎల్‌.ఓ తమ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో గల అర్హులైన ప్రతీ ఒక్కరు నమోదుగా ఉన్నారా అని సరిచూసుకోవాలని మండల తహసిల్దారులకు సూచించడం జరిగింది.తేది. 04.10.2023 నాటికి తుది ఓటర్ల జాబితా క్రమము మంథని నియోజకవర్గములో మొత్తం ఓటర్లు 2,30,306 మంది ఉండగా, ఇందులో మహిళలు :1,16,458, పురుషులు :1,13,828, ట్రాన్స్‌ జెండర్‌ : 20 మంది ఓటర్లు గా నమోదు అయినట్లు  తెలిపారు. అంతేకాకుండా, జిల్లా కలెక్టరు, పెద్దపల్లి  ఆదేశాల క్రమము నియోజక వర్గములోని 288 పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్ల కొరకై  ఎలక్షన్‌ కవిూషన్‌ ద్వారా సూచించ బడిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండే విధంగా, ప్రతీ తహసిల్దారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, మంథని నియోజకవర్గం లోని 288 పోలింగ్‌ కేంద్రాలకు బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను ఒక్కొక్క బూత్‌ కు ఒక ఏజెంట్‌ ను పార్టీ నుండి నియమించాలని ఆయన ఆదేశించారు.  ఈ సమావేశంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిఎస్పి నాయకులు,10 మండలాలకు సంబంధించిన తాసిల్దార్లు, ఎలక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు