మదనపల్లె అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగా ): ఢల్లీ లో కారు నడిపి రైతులను చంపిన మంత్రి కుమారుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె మార్కెట్ యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢల్లీిలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసన తెలియజేస్తున్న రైతుల పై నుండి కారు నడిపి వారి మృతికి కారణమైన మంత్రి కుమారుడి కేసు దర్యాప్తును ముమ్మరం చేసి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
0 కామెంట్‌లు