అక్టోబర్ 5 (ఇయ్యాల తెలంగాణ );ఎన్నికల్లో అవినీతిని ఎత్తిచూపుతూ తెరకెక్కనున్న ‘జై భారత్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ సినిమాకు సంబంధించిన సందేశాన్ని తెలిపారు. డబ్బు, మద్యం, మరే ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా చిత్తశుద్ధితో సేవలందించేందుకు తాము విశ్వసించే అభ్యర్థులకే ప్రత్యేకంగా ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఓటర్లందరికి అవగాహన పెంచడానికి ఈ మూవీ పోస్టర్ ఆవిష్కరిస్తున్నట్టు ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు.ఈ చిత్రాన్ని దర్శకుడు స్వామి ముద్దం తెరకెక్కించబోతున్నారు. నక్షత్రం ప్రొడక్షన్ వారు నిర్మించనున్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యాన్ని స్వీకరించి రాజకీయ సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్న నిరుపేద కుటుంబాల కథనాన్ని ‘జై భారత్’లో చూపించబోతున్నట్టు స్వామి ముద్దం తెలిపారు. మెరుగైన భారతదేశం కోసం మంచి మెసెజ్ ఉంటుందని, కథనం ప్రతి ఒక్క ఓటరును కదిలిస్తుందని తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
0 కామెంట్‌లు