నంద్యాల అక్టోబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించిన అనర్హుల ఓటర్ల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని బూత్ స్థాయి అధికారులతో ఇంటింటి విచారణ చేపట్టి ఓటర్ల జాబితాలో సవరించే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేశ్‌కుమార్ విూనాకు నివేదించారు. మంగళవారం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించి ఓటర్ల జాబితా పునః పరిశీలన, 6,7,8 ఫామ్ ల స్వీకరణ, ఇంటింటి సర్వే, డూప్లికేట్, షిఫ్టెడ్, డెత్ ఎలెక్టోరల్స్, జంక్ క్యారెక్టర్, 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న హౌసెస్, ఎపిక్ కార్డ్స్ జనరేషన్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సవిూక్ష నిర్వహించారు.కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తో పాటు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్‌ఓ పుల్లయ్య, అన్ని నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించిన అనర్హుల ఓటర్ల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని బూత్ స్థాయి అధికారులతో ఇంటింటి విచారణ చేపట్టి స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సూచించిన 11,113 డూప్లికేట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్లకు గాను 4,376 ఓటర్లు పెండిరగ్లో ఉన్నాయని ఫ్రీజింగ్ తొలగించిన వెంటనే మిగిలినవి పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. అలాగే ఫారం ` 6, 7, 8 లకు సంబంధించి స్వీకరించిన 31,891 దరఖాస్తులను ఇంటింటి వెరిఫికేషన్ చేయించి జాబితాలో పొందు పరుస్తామన్నారు. షిఫ్టెడ్, డూప్లికేట్, డెడ్, జంక్ క్యారెక్టర్స్,10 కంటే ఎక్కువ ఓట్లు వుండి పెండిరగ్ లో ఉన్న వాటికి సంబంధించి ఇంటింటి సర్వేలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఓటర్ల జాబితాలో సవరిస్తామన్నారు. ఎన్నికల కవిూషన్ ఆదేశాల మేరకు 73,597 ఎపిక్ కార్డుల జనరేషన్ కు చర్యలు తీసుకుంటామని కమిషనర్ కు నివేదించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నంద్యాల, ఆత్మకూరు, డోన్ ఆర్డీవోలు శ్రీనివాసులు, దాసు, వెంకటరెడ్డి, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు