విజయవాడ అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ); ఇంద్రకీలాద్రి భక్తుల జనసంద్రోహంగా మారింది.వెల్లువలా తరలివస్తున్న భక్తులు అమ్మవారి దివ్యదర్శన భాగ్యంతో తన్మయత్వం చెందుతున్నారు.దసరా ఉత్సవాల్లో బాగంగా భక్తులను తొమ్మిది అవతరాల్లో కటాక్షించే అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రిక భక్తులు పోటెత్తడంతో అమ్మవారి సన్నిది కోలాహలంగా మారింది.
తొలిరోజే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు.అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శనం కోసం వేలాదిగా పలు ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.మొదటి రోజు ఆదివారం శ్రీబాల త్రిపుర సందరీదేవా, సోమవారం గాయత్రీ దేవా, ,మంగళవారం అన్నపూర్ణాదేవి, బుధవారం మహాలక్ష్మీదేవీ, గురువారం శ్రీమహాచండీదేవి, శుక్రవారం సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఏడవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి , తొమ్మిదో రోజు ఉదయం మహిషాసుర మర్దినిదేవి, మధ్యాహ్నం 1 గంట నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళ వర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. అందుకే గాయత్రీదేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తరలించేందుకు వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. రద్దీ కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.మొదటి రోజున గవర్నర్ దర్శించుకోగా,పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ క్రమంలో సామాన్య భక్తుల విషయంలో అదికారులు వ్యవహరించిన తీరుపై మంత్రి కొట్టు సత్యన్నారాయణ అసహనం వ్యక్తం చేశారు.అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నీ విదాలుగా ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించారు.
0 కామెంట్‌లు