Ticker

6/recent/ticker-posts

Ad Code

మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు

న్యూఢల్లీ అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ): బాపు బోధనలు ప్రతి ఒక్కరి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉన్నాయి.. ఆయన కలలను నెరవేర్చేందుకు మనం ఎల్లప్పుడూ కృషి చేద్దామంటూ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆయనకు నివాళులర్పించారు. అంతేకాకుండా మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ ఘాట్‌ వద్ద ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. అంతకుముందు ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ‘‘లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ.. ఆయన సరళత, దేశం పట్ల అంకితభావం.. ‘జై జవాన్‌, జై కిసాన్‌’ ఐకానిక్‌ పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తుంది.. తరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతదేశం పురోగతి పట్ల అతని అచంచలమైన నిబద్ధత, సవాళ్ల సమయంలో అతని నాయకత్వం ఆదర్శప్రాయంగా నిలిచాయి. బలమైన భారతదేశం కోసం ఆయన దార్శనికతను సాకారం చేసుకోవడానికి మనం ఎల్లప్పుడూ కృషి చేద్దాం.’’ అంటూ ట్వీట్‌ చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు