హైదరాబాద్ అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగింది. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. వారిని అడ్డుకోవడం అన్యాయం. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని ప్రభుత్వంపై కోమటిరెడ్డి మండిపడ్డారు.
0 కామెంట్‌లు