Ticker

6/recent/ticker-posts

Ad Code

నాలుగు రైళ్ల గమ్యస్థానం పొడిగింపు జెండా ఊపి ప్రారంభించని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌ అక్టోబర్ 9(ఇయ్యాల తెలంగాణ ): సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో కాజిపేట`హడప్సర్‌ (పుణే) రైలును కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్‌ రెడ్డి సోమవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. దీంతోపాటుగా మరో మూడు రైళ్లను వర్చువల్‌ గా ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే  నాల్గు రైళ్ళను పొడిగించింది.కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ మరోసారి సాహసోపేతమైనా నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రైళ్ల పొడగింపుతో పురోగతి సాధించింది. వేల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ప్రాజెక్ట్స్‌ నిర్మాణం జరుగుతున్నాయి. .   హడప్సర్‌ `హైదరాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌  కాజీపేట వరకు,     జైపూర్‌ ` కాచిగూడ ఎక్ష్ప్రెస్స్‌ ను కర్నూల్‌ పట్టణం వరకు,     నాందేడ్‌ ` తాండూర్‌ ఎక్ష్ప్రెస్స్‌ ను రాయచుర్‌ వరకు,    కరీంనగర్‌ ` నిజామాబాదు పాసెంజర్‌ ను బోధన్‌ వరకు పోడిగించారు. తెలుగు రాష్టలలోని,వివిధ ప్రాంతాలలో రైళ్ల సర్వీస్లలో పొడగింపు, అదనపు ప్రయాణ సౌకర్యాలతో ప్రజల అవసరాలు తీరానున్నాయి.  కాజీపేట నుంచి నేరుగా పూణె వెళ్లడానికి ఈ ట్రైన్ను ఎక్స్టెండ్‌ చేస్తున్నాం.  రాయలసీమ నుంచి నేరుగా జైపూర్‌ వెళ్లడానికి కొత్త ఎక్స్టెన్షన్‌ లైన్‌ చేస్తున్నం. సికింద్రాబాద్‌ నుంచి జైపూర్కు ఉండే సర్వీస్ను.. దాన్ని కర్నూల్‌ వరకు ఎక్స్టెండ్‌ చేస్తున్నామన్నారు. కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌ వరకు ఉన్న టైన్‌ సర్వీస్ను బోధన్‌ వరకు ఎక్స్టెండ్‌ చేస్తున్నాం.  ప్రధాని మోడీ తెలంగాణలో రైల్వే నెట్‌ వర్క్‌ పెంచేందుకు కృషి చేస్తున్నారు.  రాయచూర్‌ నుంచి తాండూర్‌ సర్వీస్ను కూడా ఎక్స్టెండ్‌ చేస్తున్నాం.  గత సంవత్సరం ప్రధాని మోడీ రెండో వందే భారత్‌ ట్రైన్ను ప్రారంభించారు.  హైదరాబాద్‌ టు బెంగళూరు వందే భారత్‌ ట్రైన్ను ఇటీవల ప్రధాని ప్రారంభించారు.  దేశంలో 33 వందే భారత్‌ రైళ్లు ఉంటే.. తెలంగాణకు మూడు వందే భారత్లు రావడం గర్వకారణం.  2014లో తెలంగాణ రైల్వే బడ్జెట్‌ 258 కోట్లు అప్పటి ప్రభుత్వం పెడితే.. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 5 వేల కోట్ల బడ్జెట్‌ పెట్టింది. దాదాపు 31 వేల కోట్లతో  రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.  కోట్లాది రూపాయలతో సికింద్రాబాద్‌ సహా అన్ని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతున్నది.

 కాచిగూడ, నాంపల్లిల ఆధునీకరణతోపాటు అదనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నిర్మాణానికి కేంద్రం కృషి చేస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించుకోబోతున్నాం. ఎంఎంటీఎస్‌ సెకండ్‌ ఫేజ్‌ ప్రాజెక్టును ప్రధాని స్వయంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే.. యాదాద్రి వరకు దాన్ని ఎక్స్టెండ్‌ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ వేగంగా నిర్మాణం జరుగుతోంది.  తెలంగాణలో ఎక్కడెక్కడ కొత్త రైల్వే ప్రాజెక్టులు అవసరం ఉన్నయనేదానిపై సర్వే కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది.  వేలాది కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టులకు సర్వే జరుగుతోంది.  భవిష్యత్లో తప్పకుండా రైల్వే నెట్‌ వర్క్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నాం.  కొంత మంది మంత్రులు, నాయకులు.. రైల్వే నెట్‌ వర్క్‌ పెరగకుండా కొత్త ప్రాజెక్టులు వస్తే సహకరించడం లేదు.  సిద్దిపేట రైల్వే స్టేషన్లో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు.. కనీస విలువలు పాటించకుండా.. రైల్వే అధికారిని ఇష్టమొచ్చినట్లు తిట్టారు. సదరు నేత సొంత అసెంబ్లీ నియోజకవర్గానికి రైలు తీసుకొస్తే.. అధికారులపట్ల అనుచితంగా ప్రవర్తించడం బాధాకరం.  రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన రూలింగ్‌ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెబుతారు.  ఎవరు సహకరించినా.. సహకరించకపోయినా.. తెలంగాణలో రైల్వే నెట్‌ వర్క్ను పెంచి తీరుతాం. ? ఈ రోజు ప్రారంభించే నాలుగు రైళ్ల ద్వారా ఎవరెవరికి ప్రయోజనం చేకూరుతుందో.. వాళ్ల అందరి తరఫున ప్రధాని మోడీ కి ధన్యవాదాలు చెబున్నానని అన్నారు. .


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు