హైదరాబాద్, అక్టోబరు 13 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తిగిలిగింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గుడ్ కాంగ్రెస్‌క గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జనగామ టికెట్ దక్కదనే కారణంతో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లుతెలిసింది. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. మరి పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరితో జనగామ టికెట్ ఇస్తారా? బీఆర్‌ఎస్ టిక్కెట్‌ను పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. బహిరంగంగా అదే టాక్ నడుస్తోంది. ముత్తిరెడ్డిని కాదని మరీ.. పల్లా వైపే బీఆర్‌ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇప్పుడు పొన్నాల రాకతో జనగామరాజకీయం మరింత ఆసక్తికరంగా మారిందిపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు జనగామ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నఆయన, రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వైఎస్ కేబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణకు తొలి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. పొన్నాల లక్ష్మయ్యవరంగల్ జిల్లాలోని జనగాం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. 15 ఫిబ్రవరి 1944లో వరంగల్జిల్లాలో జన్మించిన పొన్నాల 1980 నుంచి కాంగ్రెస్‌లో పని చేస్తున్నారు.
0 కామెంట్‌లు