రాచకొండ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ):ఇబ్రహీంపట్నం లో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు తీర్పుపై రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ స్పందించారు. 2022 ఇబ్రహీంపట్నం లో రియాల్టర్ డబుల్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టుజీవిత ఖైదు విధించింది. సివిల్ డిస్ఫూట్ లో డాక్యుమెంట్లు తారుమారు చేసిన ముగ్గురు నిందితులు కల్సి ఇద్దరిని శ్రీనివాస రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి లను హత్య చేసినందుకు నిందితులు కుట్ర పన్నినట్లు అయన అన్నారు. నిందితులు మట్టరెడ్డి, ఖజమైనోద్దీన్, బిక్షపతి లకు జీవిత ఖైదు పడిరది. బాధితులకు న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నిందితులు బీహార్ నుండి ఆర్మ్ తీసుకొచ్చి హత్య చేసారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఏసీపీ శ్రీధర్ రెడ్డి ని సీనీ ప్రశంసించారు.
డబుల్ మర్డర్ కేసులో నిందితులకు జీవత ఖైదు
గురువారం, అక్టోబర్ 19, 2023
0
Tags