Ticker

6/recent/ticker-posts

Ad Code

క్రమంగా పుంజుకుంటున్న BJP

అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ): ఇటు  బీఆర్‌ఎస్‌ అటు కాంగ్రెస్‌ వారివారి సవిూకరణాలలో బిజీగా ఉంటే బీజేపీ మాత్రం తన పనిని చకచక కానిచ్చెస్తోంది. ఇప్పటికే నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ధన్‌పాల్‌ సూర్యనారాయణకు దాదాపు కన్‌ఫామ్‌గా  భావించడంతో..చాపకింద నీరులా బిజెపి ప్రచారంలో దూసుకుపోతోంది. ధన్‌పాల్‌ సూర్యనారాయణ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికి సమాజంలోని అన్ని వర్గాలకు అతను సుపరిచితుడు.

రాజకీయాలకు అతీతంగా అతను చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా నియోజక వర్గంలోని ప్రజలు ముఖ్యంగా యువత అతని వెంట ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎంపి అరవింద్‌ సహకారం దాంతో పాటు ఇటీవల ప్రకటించిన పసుపు బోర్డ్‌, మోడీ నిర్వహించిన బహిరంగ సభ బిజెపి యొక్క విజయావకాశాలనను మెరుగుపరిచే అంశాలని చెప్పుకోవచ్చు.  జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలో కూడా బిజెపి నాయకులు ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌లలో  ప్రకటించక పోవడంతో కొంత గందరగోల పరిస్థితులు నెలకొన్నప్పటికి మిగతా చోట్ల ప్రచారంలో పైచేయి గానే ఉన్నట్లు పార్టీ క్యాడర్‌ భావిస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు