వరంగల్ అక్టోబర్ 4 (ఇయ్యల తెలంగాణ );తెలంగాణ అభివృద్ధికి దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే మొహం చాటేసిన కెసిఆర్ ఫామ్ హౌస్ కి పోయి దాక్కోవడం సిగ్గు చేటని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్ తూర్పు కంటెస్టేడ్ ఎమ్మెల్యే కుసుమ సతీష్ బాబు అన్నారు. దేశ ప్రధాని వర్చువల్ గా నిజామాబాద్ నుండి ప్రారంభిస్తే బి.అర్.ఎస్ నాయకులు సిద్దిపేటలో పార్టీ కార్యక్రమంలాగ మోడీ ఫోటో తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని చింపి , మానిటర్ లో వస్తున్న నరేంద్ర మోడీ వర్చువల్ వీడియోను మంత్రి హరీష్ రావు మానిటర్ ను తన్ని అక్కడి నుండి తీసి వేయించడంపై బుధవారం వరంగల్ తూర్పు బిజెపి ఆధ్వర్యంలో హరీష్ రావు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా కుసుమ సతీష్ బాబు మాట్లాడుతూ సాక్షాత్తు దేశ ప్రధాని ఫెక్సీనీ చింపుమన్న ఎంపి కొత్త ప్రభాకర్, మంత్రి హరీష్ రావులపై రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట సిపి తక్షణమే కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. సభ్య సమాజం సిగ్గు పడేలా మంత్రి హరీష్ రావు మంది మర్బలం తో అధికారులు నరేంద్ర మోడీ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపి , మానిటర్ లో వస్తున్న నరేంద్ర మోడీ వర్చువల్ వీడియోను తన్ని అక్కడి నుండి తీసి వేయించడం ఎంత వరకు సమంజసం అన్నారు. హరీష్ రావు, కొత్తపెల్లి ప్రభాకర్ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు బే శరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అహంకారానికి తెలంగాణ సమాజం తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. కచ్చితంగా పార్టీ పరంగా ఈ సంఘటనను పార్ల మెంట్ దృష్టికి తీసుకెళ్లి , నరేంద్ర మోడీ దృష్టికి , పార్లమెంట్ ప్రి విలేజ్ కమిటీ దృష్టి కి తీసుకెళ్తామని రాజ్యాంగం పరమైన కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల రఘునారెడ్డి, ఏల్లబోయిన చంద్రమోహన్,ఐటి సోషల్ విూడియా కన్వీనర్ ఆడెపు వేంకటేష్, దళిత్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు, పోలేపాక జనార్దన్, భైరీ నాగరాజు, మైదం వీరాస్వామి, పెండ్యాల రమేష్, మైదం సుదర్శన్, భైరీ మురళీకృష్ణ డివిజన్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు