హైదరాబాద్, అక్టోబరు 2 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో భారీ ఐటి పార్కుకు సోమవారం ఉదయం ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఐటి పార్కు భవన నమూనాను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పది ఎకరాల విస్తీర్ణంలో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో భారీస్థాయిలో ఐటీ టవర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో దాదాపు 50 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనుంది.హైదరాబాద్ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు.
ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మూసీ ఆధునీకరణ పనులను త్వరలో పూర్తిచేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో గతంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. చిన్నప్పుడు మలక్‌పేట్ అంటే టీవీ టవర్ అనేవాళ్లని, రాబోయే రోజుల్లో మలక్‌పేట అంటే ఐటీ టవర్ అంటారన్నారు. 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అయితే మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్ల వ్యయంతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. 36 నెలల్లోనే ఐటీ టవర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వెల్లడిరచారు.
మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి పెద్దకంపెనీలు ఇక్కడకు తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకెళ్తున్నదని చెప్పారు. బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామని కేటీఆర్ తెలిపార. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది.. బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(ఓతినితిబబివతీ ఐుఖీ) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తలసరి ఆదాయం సహా పలు అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను అధిగమించామని చెప్పారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు.
0 కామెంట్‌లు