న్యూఢిల్లీ, అక్టోబరు 2 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అర్జంట్‌గా ఢిల్లీ రావాలని హైకమాండ్ ఆదేశించడంతో మంగళవారం నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బహిరంగసభ ఏర్పాట్లు పర్యవేక్షించాల్సి ఉన్నా వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, మోదీ సభపై అమిత్ షాతో చర్చించారు.స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తే..చాలా మంది సీనియర్ నేతలు హాజరు కాలేదు. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు సభలో ఎక్కడా కనిపించలేదు. వీరంతా కొద్ది రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ ను ఓడిరచడానికి ఏం చేయడానికైనా సిద్ధమని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడిరచడానికే తాము బీజేపీలో చేరామని కానీ ఇప్పుడు బీజేపీ .. బీఆర్‌ఎస్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తోందని వారంటున్నారు.
మాజీ ఎంపీ విజయశాంతి ఇదే తరహా ప్రకటనలు సోషల్ విూడియాలో చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పట్ల కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్ల ‘బీజేపీ`బీఆర్‌ఎస్ ఒక్కటే’ అన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని అసంతృప్త నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదని అధినాయకత్వం మాకు స్పష్టమైన హావిూ ఇచ్చింది కానీ మాట మార్చిందని వారంటున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు ఢల్లీికి వెళ్లారు. కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా తో అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీ లో నెలకొన్న పరిస్థితి లు, మోడీ సభ పై కిషన్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. మోడీ సభ పై కూడా కిషన్ రెడ్డి వివరించినట్లు, తెలంగాణ లో మరిన్ని మోడీ సభలు పెట్టాలని ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మల్, కరీంనగర్ లలో కూడా మోడీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు సమావేశం అయిన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు.. అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేసిన నేతలు.. కొన్ని నియోజక వర్గాలకు పేర్లని ఖరారు చేసినట్టు సమాచారం. నెక్ట్స్ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ విూటింగ్ లో తెలంగాణ అభ్యర్థులు పై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన ఉంటుందని ఆయన అన్నారు. అక్టోబర్ రెండోవారంలో బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డ్ లను ప్రధాని ప్రకటించారని, పసుపు బోర్డ్ కోసం ఎన్నో ఏళ్లుగా రైతుల డిమాండ్ ఉందన్నారు. రేపు మోడీ మళ్ళీ తెలంగాణకు వస్తున్నారని, నిజామాబాద్ భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పాలమూరు సభ జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 10 న అమిత్ షా తెలంగాణకు వస్తారని, అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయన్నారు కిషన్ రెడ్డి. జేపీ నడ్డా రానున్న ఎన్నికల కోసం దిశానిర్దేశం చేస్తారని అన్నారు
0 కామెంట్‌లు