వికారాబాద్ అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల వాహనాల తనిఖీలలో భాగంగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో హైదరాబాద్ నుండి తాండూర్ వెళ్తున్న కారులో తనిఖీలు చేయగా 9.5 లక్షలనగదు పట్టుబడిరది. ఇట్టి నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50 వేలకు మించి నగదు పట్టుబడితే నగదుకు సంబంధించిన పూర్తివివరాలను తెలియజేయాలని వికారాబాద్ సిఐ టంగుటూరి శ్రీను తెలిపారు.
0 కామెంట్‌లు