జగిత్యాల అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ): జగిత్యాల జిల్లా లోని మల్లాపూర్ మండలం ఓబులాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికలల్లో తనిఖీలు భాగంగా పోలీసులు వాహనాలు తనిఖీలల్లో ఒక లక్ష 97 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.. అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ లింగాపూర్ గ్రామ గండి హనుమాన్ ఆలయం వద్ద పోలీసులు తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కారులో 5 లక్షల 30 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.. ఈ రెండు చెక్ పోస్ట్ తనిఖీలలో డబ్బులను సీజ్ చేసి సంబంధిత జిల్లా అధికారులకు 7,27 లక్షల రూపాయలు మొత్తం పంపినట్లు మెట్ పల్లి సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.. ఈ తనిఖీల్లో నాయక్ తహసిల్దార్, ఫ్లయింగ్ స్కాడ్ ఎండి. ఖాదీర్ ,మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఎస్సైలు నవీన్ కుమార్, ఉమా సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
0 కామెంట్‌లు