Ticker

6/recent/ticker-posts

Ad Code

ఈ నెల 6 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహారం ప్రారంభం

 

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ ): ఈ నెల 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని, రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 14 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల బతుకమ్మ చీరల పంపిణీని పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో యువతకు 18 వేల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు