Ticker

6/recent/ticker-posts

Ad Code

4 న 57 SC ఉపకులాల ఆత్మగౌరవ సభ : గోడ పత్రిక విడుదల


వరంగల్, అక్టోబర్ 1 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్ లో ఈ నెల 4 వ తేదీన జరగబోవు 57 ఎస్సీ ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయూలని, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు  టి ఎల్  స్వామి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 29 నాడు ఆయన ఆధ్వర్యంలో  ఉపకులాల ఆత్మగౌరవ సభకి సంబందించిన గోడ పత్రికను నర్సంపేట లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిఎల్ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఉపకుల జాతులు ఐక్యమై తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడవల్సిన అవసరముందన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జీల్లా వైస్ ప్రెసిడెంట్ సల్లా లక్ష్మన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్యామ్ కూమార్. దేవరకొండ వీరయ్య,ప్రసాద్ ,రాకేశ్  ఆనంద్  శివక్రిష్ణ,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు