శ్రీశైలం అక్టోబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ):శ్రీశైల దేవస్థానంలో ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆరోజు సాయంత్రం గం. 5.00ల నుంచి మరుసటి రోజు అనగా 29వ తేది ఉదయం గం. 5.00ల వరకు ఆలయద్వారాలను మూసివేయడం జరుగుతుంది29వ తేది ఉదయం 5.00 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి. సంప్రోక్షణ, ప్రాతకాల పూజల అనంతరం: 7 గంటల నుండి దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జితసేవలు ప్రారంభించబడుతాయికాగా చంద్రగ్రహణం రోజైన 28వ తేదీన మధ్యాహ్నం గం. 3,30ల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం కల్పించబడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం గం. 12.30ల వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహించబడుతాయి. ఆ రోజున సామూహిక అభిషేకాలు ఉదయం మాత్రమే నిర్వహించబడుతాయి. అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనానికి రూ.500/`లు టికెట్ ఉదయం మాత్రమే అవకాశం కల్పించబడిరదిమధ్యాహ్నం గం. 12.30లకు నిర్వహించబడే సామూహిక అభిషేకాలు మరియు స్పర్శదర్శనం నిలుపుదలచేయబడ్డాయి. ఇక గ్రహణం రోజున మధ్యాహ్నం గం. 3.30ల నుండి మంగళవాయిద్యాలు, సుసాంధ్యం, సాయంకాల పూజలు, మహామంగళ హారతులు జరిపించబడుతాయి. అనంతరం గం. 5.00లకు ఆలయద్వారాలు మూసివేయడం జరుగుతుందిగ్రహణం రోజున శ్రీస్వామివార్ల నిత్యకల్యాణం కూడా నిలుపుదల చేయడం జరిగింది. గ్రహణం కారణంగా పైన తెలపబడిన విధంగానే ఆలయప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలుమరియు సాక్షిగణపతి, హాఠకేశ్వరం` పాలధార పంచధార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా సాయంత్రం గం.5.00ల నుండి మూసివేయబడుతాయిమధ్యాహ్నం వరకే అన్నప్రసాద వితరణగ్రహణం కారణంగా 28 భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా ఉదయం గం.10.00ల నుండి మధ్యాహ్నం వరకే నిర్వహించబడుతుంది. ఆ రోజు రాత్రి అల్పాహార వితరణ నిలుపుదల చేయబడుతుంది.
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న ఆలయద్వారాలు మూసివేత
బుధవారం, అక్టోబర్ 25, 2023
0
Tags