Ticker

6/recent/ticker-posts

Ad Code

21న GAGANYAAN

బెంగళూరు, అక్టోబరు 17, (ఇయ్యాల తెలంగాణ );అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపే గగన్‌యాన్‌ మిషన్‌ లో అక్టోబర్‌ 21న కీలక అడుగు ముందుకు పడనుంది. టీవీ`డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌ను అక్టోబర్‌ 21వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి టీవీ`డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌ నిర్వహించనున్నారు. క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం.. ఆ తర్వాత సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సంబంధించిన టెస్ట్‌ చేయనున్నారు. పీడనం లేని క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాములను నింగిలోకి పంపించనున్నారు. అయితే ప్రస్తుతం

 చేయనున్న పరీక్షల్లో ఈ క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపి.. అక్కడి నుంచి సేఫ్‌గా బంగాళాఖాతంలో ల్యాండ్‌ చేయనున్నారు. అక్కడి నుంచి ఇండియన్‌ నేవీ ఆ మాడ్యూల్‌ మిషన్‌ను తీసుకురానున్నట్లు ఇస్రో వెల్లడిరచింది. గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలకమైన క్రూ మాడ్యూల్‌ పరీక్షకు ఇస్రో సిద్దమైంది. క్రూ మాడ్యూల్‌ టీవీ`డీ1ను లాంచింగ్‌ కోసం ఇటీవల కాంప్లెక్స్‌కు తీసుకువచ్చింది. పీడనం లేనటువంటి క్రూ మాడ్యూల్‌ లోనే వ్యోమగాములు నింగిలోకి వెళ్తారు. ఈ పరీక్ష సమయంలో ఆ మాడ్యూల్‌ బంగాళాఖాతంలో ల్యాండ్‌ అవుతుంది. సముద్రం నుంచి ఇండియన్‌ నేవీ ఆ మాడ్యూల్‌ మిషన్‌ను భూవ్మిూదకు తీసుకువస్తుంది. టీవీ`డీ1మాడ్యూల్‌ నిర్మాణం తుది దశలో ఉందని, ఈ మాడ్యూల్‌ 17 కిలోవిూటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత అబార్ట్‌ సీక్వెన్స్‌లో భాగంగా మళ్లీ భూమి విూదకు వస్తుందని ఇస్రో తెలిపింది. పారాచూట్ల సాయంతో టీవీ`డీ1 దిగుతుంది. శ్రీహరికోట నుంచి 10 కిలోవిూటర్ల దూరంలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్‌ ల్యాండ్‌ కానుంది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు