Ticker

6/recent/ticker-posts

Ad Code

సమాచార హక్కు చట్టం `2005 ప్రజలచేతిలో వజ్రాయుధం

బద్వేలు అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ):బద్వేలు పట్టణం లోగల ఆర్‌.టి.సి కార్మికుల  మజ్దూర్‌ యూనియన్‌ కార్యాలయం నందు కడప జిల్లా సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక ఆధ్వర్యాన సమాచార హక్కు చట్టం అమలుజరిగిన రోజు  సందర్భంగా గురువారం చట్టంపైన అవగాహన సదస్సు ఏర్పాటుచేయడమైనది. ఈ సందర్భంగా  జిల్లా సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా ఉపాధ్యక్షులు బద్వేలు గురుమూర్తి  మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం`2005 అక్టోబరు 12 న అమలుచేయడం జరిగినది.అవినీతి నిర్మూలన కు పారదర్శకత కు ,జవాబు దారి తనానికీ ఇది ప్రజలచేతిలో వజ్రాయుధమనీ ,ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందనీ,ఈ చట్టాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని,అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురిచేసి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సమాచారం అడిగిన వారికి సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, అన్ని మండల ,జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ సెల్‌ రోజున చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సెల్‌ ను ఏర్పాటుచేయాలన్నారు.తర్వాత సమాచార హక్కు చట్టం సెక్షన్ల అవగాహన కరపత్రాలు మరియు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయడమైనది.  ఈ కార్యక్రమంలో బద్వేలు ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, ఫూలే అంబేడ్కర్‌ రాజ్యాధికార సమితి జిల్లా ఇన్ఛార్జి యం.పిచ్చయ్య, బి.యస్‌.పి నియోజకవర్గ అధ్యక్షులు గౌస్పీర్‌,ఆవాజ్‌ కమిటీ బద్వేలు అధ్యక్షులు యస్‌.ఎ సత్తార్‌ ,డి.బి.యఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.చిన్నయ్య, దళిత నాయకులు ఓ.యస్‌.వి ప్రసాద్‌,రాష్ట్ర కళాకారుల సంక్షేమ సంఘ నాయకులు సామ్యూల్‌, ముస్లింల మైనారిటీ నాయకులు రసూల్‌,మస్తానయ్య, ఖాజాహుస్సేన్‌, బి.సి సంఘ నాయకులు బోలా నారాయణ, జి.నాగేంద్ర, ఆర్‌.టి.ఐ సీనియర్‌  ఆక్టివిస్ట్‌ రాజగోపాల్‌ రెడ్డి,డి.వై.యఫ్‌. వై నాయకులు జి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు