Ticker

6/recent/ticker-posts

Ad Code

130 కోట్లకు చేరిన సోమ్ము


హైదరాబాద్‌, అక్టోబరు 18, (ఇయ్యాల తెలంగాణ ); గుట్టలుగుట్టలుగా పట్టుబడుతున్న డబ్బును చూసి అధికారులు సైతం అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు దాగిన బ్లాక్‌ మనీ సొమ్ము.. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయ్‌. చెక్‌ పోస్టుల వద్ద నోట్ల కట్టలు గుట్టలుగా బయటకొస్తున్నాయి.తెలంగాణ దంగల్‌లో మనీ, మందు పంపిణీపై ఈసీ నిఘా పెంచింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. టచ్‌ చేస్తే క్యాష్‌ కోట్లలో పట్టుబడుతోంది. నగదుతో పాటు ఈసారి నగలు జిగల్మేన్నాయి. మియాపూర్‌లో ఓ కారులో 17 కేజీల బంగారం..17కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక కవాడీగూడలో 2 కోట్ల 9 లక్షల క్యాష్‌ పట్టుపడిరది. తనిఖీల్లో క్యాష్‌ కన్నా గోల్డ్‌ ఎక్కువగా తళుక్కుమంటోంది. ఇప్పటి వరకు దాదాపు 56 కోట్ల నగదు పట్టుపడిరది. అందుకు దీటుగా దగ్గర దగ్గర 39కోట్ల విలువైన నగలను సోదాల్లో సీజ్‌ చేశారు అధికారులు. పట్టుబడిన బంగారం జువెలర్స్‌ షాప్‌లకు సంబంధించిందని గుర్తించారు. ఐతే రశీదులు,సరైన వివరాలు చెప్పకపోవడంతో పట్టుబడిన బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో వుందని తెలిసినా కూడా లెక్కా పత్రాల్లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు, నగదు బట్వాడా చేయడం సరికాదన్నారు. సరైన వివరాలు చెప్పకపోవడం వల్లే ఆ సొత్తును సీజ్‌ చేయాల్సి వచ్చిందన్నారు పోలీసులుఇప్పటి వరకు తనిఖీల్లో 130 కోట్ల విలువైన నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు పోలీసులు. 72 కేజీల బంగారం..422 కిలోల వెండితో పాటు ఖరీదైన 42 డైమండ్లను స్వాధీనం చేసుకున్నారు. క్యాష్‌, గోల్డ్‌తో పాటు 2 కోట్ల 60 లక్షల విలువ చేసే మద్యాన్ని కూడా చేశామన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వారంలోనే 100 కోట్లకు పైగా సొత్తు దొరకడం తీవ్ర కలకాలంరేపుతుంది . ఇటు హైదరాబాద్‌ సహా జిల్లాల వారీగా తనిఖీలను ముమ్మరం చేశారు అధికారులు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. మరోవైపు మనీ, మద్యం పంపిణీపై పొలిటికల్‌ సవాళ్లు` ప్రతిసవాళ్ల మోత మోగుతోంది. తెలంగాణ ఎన్నికల సంఘం నిర్వహించిన ఆల్‌ పార్టీ విూటింగ్‌లో పలువురు ఇదే అంశంపై ప్రధానంగా ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో ఈసారైనా ప్రలోబాల పర్వానికి కళ్లెం పడుతుందా?లేదంటే మనీ, మద్యం ప్రవాహం మరింత కట్టలు తెగుతుందా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు