Ticker

6/recent/ticker-posts

Ad Code

బాణాసంచ పేలుళ్లలో 10 మంది మృతి

చెన్నై అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ): తమిళనాడులో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి.శివకాశీలోని రెండు బాణాసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో పది మంది కార్మికులు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుంటంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు