హైదరాబాద్, అక్టోబరు 17, (ఇయ్యాల తెలంగాణ ); ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుండగా.. కేసీఆర్ కూడా బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రిలీజ్ చేసి.. ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలు చూస్తుంటే.. ప్రజల్ని ఆకర్షించటానికి హారాహోరీగా పథకాల రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికలు సంక్షేమం చుట్టూనే తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. బీఎస్‌పీ మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ విడుదల చేశారు. 10 పథకాలతో బీఎస్‌పీ మేనిఫెస్టో విడుదలయ్యింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఃూఖ మేనిఫెస్టో విడుదల చేశారు.
10 పథకాలతో బీఎస్‌పీ మేనిఫెస్టో..
1 ) కన్సీ యువ సర్కార్
2 ) బహుజన రైతు ధీమా
3 ) పూలే విద్యా దీవెన
4 ) బ్లూ జాబ్ కార్డు
5) దొడ్డి కొమరాయ్య భూమి హక్కు
6 ) నూరేళ్లు ఆరోగ్య ధీమా
7 ) చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
8 ) వలస కార్మికులు సంక్షేమ నిధి
9 ) భీమ్ రక్షణ కేంద్రం
10 ) షేక్ బందగీ గృహ భరోసా
బీఎస్పీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..
1.కాన్షి యువ సర్కార్ పథకం కింద యువతకు అయిదు ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. అందులో మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు.
2.బహుజన రైతు ధీమా ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు, రైతులకు విత్తనం నుండి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ, ధరణి పోర్టల్ రద్దు చేస్తాము.
3. దొడ్డి కొమురయ్య భూమి హక్కు పథకం కింద భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 1ఎకరం భూమి, మహిళలపేరిట పట్టా.
4.చాకలి ఐలమ్మ మహిళ జ్యోతి పథకం కింద మహిళ కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ శిక్షణ, అంగన్వాడీ, ఆశ వర్కర్ల ఉద్యోగుల క్రమబద్ధీకరణ. మహిళ సంఘాలకు ఏటా ఒక లక్ష రూపాయలు.
5. బీమ్ రక్ష కేంద్రాలు.వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం, రక్ష కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.
6. పూలే విద్యా దీవెన పథకం కింద మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశి విద్య డాట, ం1 కోడిరగ్ లో శిక్షణ
7. బ్లూ జాబ్ కార్డు పథకం కింద పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హావిూ, రోజు కూలీ 350 ఇస్తాము, కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా.
8. నూరేళ్ళ ఆరోగ్య ధీమా పథకం కింద ప్రతి కుటుంభానికి 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజ్. ఏటా 25,000కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్.
9. వలస కార్మికుల సంక్షేమ నిధి పథకం కింద 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి గిగ్ కార్మికులు లారి, ట్యాక్సీ డ్రైవర్ లకు 600 సబ్సిడీ క్యాంటీన్ లు.
10. షేక్ బందగీ గృహ బరోసా పథకం కింద ఇళ్లు లేని వారికి 550 గజాల ఇంటి స్థలం ఇళ్లు కట్టుకునే వారికి 6 లక్షల సహాయం. ఇంటి పునర్మిరానికి 1.5 లక్షల సహాయం.
0 కామెంట్‌లు