` నేను ఈ వెబ్ సిరీస్ లో మాయ అనే క్యారెక్టర్ చేశాను. మాయ ఒక అందమైన అమ్మాయిగా కనిపిస్తాను. ఆ తర్వాత దెయ్యంగా కనిపిస్తాను. ఆమె ఒక మిస్టీరియస్ వుమెన్. అయితే విూరు ట్రైలర్ చూసింది కొంత పర్సెంట్ మాత్రమే. నా క్యారెక్టర్ లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి.
` అతిథి వెబ్ సిరీస్ కోసం ప్రవీణ్ సత్తారు గారి ఆఫీస్ కు వెళ్లి కథ విన్నప్పుడు చాలా గ్రిప్పింగ్ అండ్ స్ట్రెంత్ ఉన్న కథ అనిపించింది. ప్రవీణ్ సత్తారు గారు ఈ సిరీస్ ను బాగా డిజైన్ చేశారు. ఇందులో థ్రిల్లర్, ఫాంటసీ, హారర్ జానర్స్ కలిసి ఉంటాయి. ఇవన్నీ కథలో నెక్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రేక్షకులు ఊహించలేని మలుపులు ఉంటాయి. తెలుగులో హారర్ కంటెంట్ తక్కువగా వస్తుంటుంది. నాకు ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎందుకంటే నటిగా రొటీన్ గా ఉండొద్దని అనుకుంటా.
` వేణు గారితో కలిసి నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆయన ఇచ్చిన సలహాలతో నేను మరింత బాగా నటించగలిగాను. నటుడిగా ఆయన హ్యూమర్ ఎంత బాగుంటుందో విూ అందరికీ తెలుసు. ఆయనది మంచి వ్యక్తిత్వం. కోస్టార్స్ తో ఎంతో సపోర్టివ్ గా ఉంటారు.
` మాయ క్యారెక్టర్ గా మారిపోయేందుకు నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. నేను బయట చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటాను. మాయ చాలా కామ్ గా ఉంటుంది. ఎమోషన్స్ అన్నీ మనసులో దాచుకుంటుంది. నేను రియల్ లైఫ్ లో ఈ క్యారెక్టర్ కు అపోజిట్ గా ఉంటా. కానీ సెట్ లోకి రాగానే మాయ క్యారెక్టర్ లా ఉండేందుకు ట్రై చేశా.
` అతిథి వెబ్ సిరీస్ ను అరుంధతి, చంద్రముఖి లాంటి స్క్రిప్ట్స్ తో కంపేర్ చేయలేం. ఇదొక భిన్నమైన స్క్రిప్ట్. ఇలాంటి కథకు మంచి కాస్టింగ్ కావాలి. అలాంటి కాస్టింగ్ అతిథికి కుదిరింది. నటిగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రెండూ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ఫార్మేట్స్ మారిపోయాయి. అన్ని రకాల ఆడియెన్స్ కు రీచ్ అవ్వాలనేది నా ప్రయత్నం.
` ఇవాళ ఆడియెన్స్ చాలా కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి కొత్తదనంతో పాటు సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ అతిథిలో ఉంటాయి. డైరెక్టర్ భరత్ వైజీ టాలెంటెడ్ పర్సన్. కామ్ గా సెట్ లో వర్క్ చేస్తుంటాడు. నేను అతన్ని బుద్ధ అని పిలుస్తుంటాను. ఇలాంటి డార్క్ కంటెంట్ ఎలా రాయగలుగుతున్నారు అని చాలాసార్లు అడిగాను. ఈ సినిమాతో భరత్ కు మంచి గుర్తింపు దక్కుతుంది.
` ప్రస్తుతం నేను గోలీసోడా అనే మరో వెబ్ సిరీస్ చేస్తున్నాను. అలాగే నేను చేసిన మూడు తమిళ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.