చంద్రుడిపై Vibrations రికార్డు!
శుక్రవారం, సెప్టెంబర్ 01, 2023
0
బెంగళూరు, సెప్టెంబర్ 1, (ఇయ్యాల తెలంగాణ) : భూవిూద ప్రకంపనలు వస్తే భూకంపం అంటారు. అదే చంద్రుడి విూద ప్రకంపనలు వస్తే..? ప్రస్తుతానికి చంద్రకంపం అనుకుందాం. ఇలాంటి ఓ యాక్టివిటీని ఎక్స్ పీరియన్స్ చేశాయి చంద్రుడి సౌత్ పోల్ దగ్గర్లో ఉన్న చంద్రయాన్ ` 3లోని విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్. ఆగస్టు 26న వచ్చిన ఈ ప్రకంపనలను ల్యాండర్, రోవర్ రెండూ నమోదు చేశాయి. ల్యాండర్ లో ఉన్న ఓ పేలోడ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది లూనార్ సెసిమిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్యే)ఈ ప్రకంపనలను రికార్డు చేసింది. ఈ పేలోడ్ చంద్రుడిపైన దిగిన మొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ టెక్నాలజీ ఆధారిత ఇన్స్ట్రుమెంట్ అని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ల్యాండర్, రోవర్ కొంత వైబ్రేషన్స్ కు గురవడాన్ని రికార్డు చేసిందని తెలిపారు.ఇవి నేచురల్ గా వస్తాయా లేదా ఏదైనా విపత్తా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని ఇస్రో తెలిపింది. ల్యాండర్ తో పాటు రోవర్ లోనూ ఈ కదలికలను గుర్తించినట్లు సెస్మోగ్రాఫ్ ను ఇస్రో ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఇస్రో ప్రకటన మేరకు.. ఈ ఐఎల్ఎస్యే ఆరు హై`సెన్సిటివిటీ యాక్సిలెరోవిూటర్ల క్లస్టర్‌ను కలిగి ఉంది. వీటిని సిలికాన్ మైక్రోమషినింగ్ ప్రాసెస్ ఉపయోగించి దేశీయంగా తయారు చేశారు. కోర్ సెన్సింగ్ ఎలిమెంట్ అనేది దువ్వెన నిర్మాణంలో ఉండే ఎలక్ట్రోడ్లతో కూడిన స్ప్రింగ్`మాస్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. బాహ్యంగా వచ్చే వైబ్రేషన్స్ స్ప్రింగ్ యొక్క కదలికలకు దారితీస్తాయి. ఫలితంగా కెపాసిటెన్స్లో మార్పు వస్తుంది.. ఇది వోల్టేజ్‌గా మారుతుంది.సహజంగా ఏర్పడే గ్రౌండ్ వైబ్రేషన్స్ (చంద్రకంపాలు), వాటి ఇంపాక్ట్, ఆర్టిఫిషియల్ ఈవెంట్స్ ద్వారా జెనరేట్ అయ్యే గ్రౌండ్ వైబ్రేషన్స్ ను కొలవడం ఐఎల్ఎస్యే ప్రాథమిక లక్ష్యం. ఆగస్టు 25, 2023న రోవర్ నావిగేషన్ సమయంలో నమోదైన వైబ్రేషన్లు ఈ చిత్రంలో చూపించాము.
ఇంకా, ఆగష్టు 26, 2023న రికార్డ్ చేసిన నేచురల్ గా అనిపించే ఈవెంట్ కూడా ఉంది. ఈ పరిణామానికి సంబంధించి కచ్చితమైన మూలాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం.ూం పేలోడ్‌ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ మద్దతుతో బెంగళూరులోని లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో, ఆప్టిక్స్ సిస్టమ్స్ (ఒఇూూ)లో తయారు చేశారు. చంద్రుడి ఉపరితలంపై ఐఎల్ఎస్యే పని చేసేలా ఈ వ్యవస్థ పని చేయడం కోసం దీన్ని బెంగళూరులోని ఉడుపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ (ఙఖీూఅ) అభివృద్ధి చేసింది’’ అని ఇస్రో ప్రకటన విడుదల చేసింది.ఇస్రో నేడు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ వీడియోని షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై రోవర్ అటూ ఇటూ కదులుతున్న వీడియోని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోవర్ 360 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. సేఫ్ రూట్‌ని చూసుకుంటూ ముందుకు కదులుతుండటాన్ని గమనించవచ్చు. ఇందులో రోవర్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోపై ఇస్రో చాలా పొయెటిక్‌గా స్పందించింది. రోవర్ చంద్రుడిపై తిరుగుతుంటే చిన్న పిల్లాడు చందమామపై ఆడుకుంటున్నట్టుగా ఉందని ట్వీట్ చేసింది
Tags