Ticker

6/recent/ticker-posts

Ad Code

వచ్చేస్తున్న UPI ATM

ముంబై, సెప్టెంబర్‌ 12, (ఇయ్యాల తెలంగాణ );  డిజిటల్‌ చెల్లింపు లావాదేవీల విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఎవరైనా షాపింగ్‌కి వెళ్లాలన్నా, మార్కెట్‌ నుంచి కూరగాయలు కొనాలన్నా జేబులో పర్స్‌ లేకపోయినా ఫోన్‌ ఉంటే సరిపోతుంది. విూ చేతిలోని ఫోన్‌ సహాయంతో యూపీఐ  చెల్లింపు చేయడం ద్వారా క్రయవిక్రయాలు సులభతరం అయ్యింది. అందుకు ఏటీఎమ్‌ కార్డు కూడా వినియోగించాల్సిన అవసరం లేదు. అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు జేడులో సరిపడా డబ్బులేక ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇతరులకు యూపీఐ  పేమెంట్‌ చేసి డబ్బు తీసుకుంటుంటారు. లేదంటే ఏటీఎమ్‌కి వెళ్లి డబ్బు డ్రా చేసుకుంటారు.యూపీఐ లేదా ఆన్‌లైన్‌ చెల్లింపులు అందుబాటులో లేని సందర్భాల్లో కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా టూరిస్ట్‌ స్పాట్‌ల వద్ద ఇలాంటి సమస్యలు చాలాసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సమస్యలను ఎదుర్కోవటానికి సులభమైన మార్గం మార్కెట్లోకి వచ్చింది.తాజాగా యూపీఐ   ఏటీఎం అందుబాటులోకి వచ్చన సంగతి తెలిసిందే. దీని సహాయంతో విూరు కార్డు లేకుండా కూడా నగదు తీసుకోవచ్చు. ఐతే దీనిని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. ఈ విధానానికి కూడా విూ దగ్గర ఏటీఎం ఉండాల్సిన అవసరం లేదు. ఫోన్‌ ఉంటే సరిపోతుంది. అదెలాగంటే..ముందుగా విూరు ఏదైనా యూపీఐ  ఏటీఎంకి వెళ్లాలి. అక్కడ కార్డ్‌ లెస్‌ లావాదేవీపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై డబ్బు డ్రా చేసే అప్షన్లు వస్తాయి. అందులో ఒక మొత్తాన్ని ఎంచుకోవాలి. మొత్తాన్ని ఎంచుకున్న తర్వాత, స్క్రీన్‌పై ఖిఖీ కోడ్‌ కనిపిస్తుంది. దాన్ని విూ ఫోన్‌తో స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. స్కాన్‌ చేయడానికి విూ ఫోన్‌లో ఉన్న ఏదైనా యూపీఐ  యాప్‌ని తెరిచి ఖిఖీ కోడ్‌ని స్కాన్‌ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా విూరు అనేక యూపీఐ  ఖాతాలు ఉపయోగిస్తుంటే ఇక్కడ ఏ ఖాతాను ఎంచుకోవాలో కూడా ఆప్షన్లు వస్తాయి. ఖాతాను ఎంచుకున్న తర్వాత యూపీఐ పిన్‌ను నమోదు చేస్తే సరి. ఏటీఎమ్‌ నుంచి కార్డు లేకుండానే డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు.విత్‌ డ్రా తర్వాత విూ ఫోన్‌కు లావాదేవీకి సంబంధించిన మెసేజ్‌ కూడా వస్తుంది. అలాగే యూపీఐ  ఏటీఎం  నుంచి డబ్బు విత్‌డ్రా, నగదు ఉపసంహరణకు కూడా ఎక్కడా ఏటీఎమ్‌లో కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాగా యూపీఐ  ఏటీఎం ను ఔఖఅఎ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు