Ticker

6/recent/ticker-posts

Ad Code

TET పరీక్షలో విషాదం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ముగిసింది. పరీక్ష హాళ్లలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 1,139 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్‌ పేపర్‌`1, పేపర్‌`2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్‌`1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్‌`2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాల్లో 2,08,498 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన టెట్‌ ఎగ్జామ్‌ లో విషాదం చోటుచేసుకుంది. సమయం కంటే ముందే హాజరు కావాలని 8నెలల నిండు గర్భణీ ఎగ్జామ్‌ రాసేందుకు పరుగెత్తుకుంటూ వచ్చి ఎగ్జామ్‌ హాల్లో కుప్పకూలిపోయింది. స్పందించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.గచ్చిబౌలిలో అరుణ్‌, రాధిక నివాసం ఉంటున్నారు. రాధిక 8 నెలల గర్భవతి. రాధిక టెట్‌ ఎగ్జామ్‌ కు ప్రిపేర్‌ అవుతుంది. అయితే ఇవాళ టెట్‌ ఎగ్జామ్‌ ఉండటంతో సంగారెడ్డి జిల్లా పఠాన్‌ చెరువు మండలం ఇస్నాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు భర్త అరుణ్‌ తో కలిసి రాధిక వెళ్లింది. పరీక్షకు వెళ్లే తొందరలో తను ఎనిమిది నెలల గర్భవతి అనే సంగతి మరిచింది. పరిగెత్తుకుంటు పరీక్షా గదికి చేరుకుంది. తన సీటులో కూర్చొంది ఇంతలోనే రాధికకు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే రాధిక పడిపోయింది. అక్కడున్న విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. రాధిక పడిపోవడం ఉపాధ్యాయులకు చెప్పడంతో రాధికపై నీళ్లు చెల్లిన ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే ఉన్న పోలీసులకు, యాజమాన్యానికి చెప్పడంతో వెంటనే రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాధికను వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. రాధిక మృతితో భర్త అరుణ్‌ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చిన తన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్‌ హాల్‌ కు తొందరగా వెళ్లాలనే టెన్షన్‌ తోనే ఇలా జరిగిందని వాపోయాడు. తన భార్యను కోల్పోయానని వాపోయాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు