Ticker

6/recent/ticker-posts

Ad Code

Temple రికార్డుల్లో నమోదు కాని Gold


మెదక్‌, సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : ఏడు పాయల ఆలయం ఈవో  సారా శ్రీనివాస్‌ లీలలు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏడు పాయల అమ్మవారి బంగారాన్ని ఈవో సారా శ్రీనివాస్‌ ఇంట్లో పెట్టుకున్నారు. ఈ  ఘటన మరవకముందే తునికి నల్లపోచమ్మ బంగారు చైన్‌ మాయమైన ఘటన తెరపైకి వచ్చింది. 2018లో తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి  ఐదు  తులాల బంగారు చైన్‌ ను  ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి బహుకరించారు. ఆ సమయంలో ఆలయ ఈవోగా సారా శ్రీనివాస్‌ విధులు నిర్వహించారు. ఎమ్మెల్యే బహూకరించిన చైన్‌  దేవాలయ రికార్డుల్లోనూ నమోదు కాలేదు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు