Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana విమోచన దినోత్సవానికి KCR కు ఆహ్వానం


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ) :  విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలను పురస్కరించుకుని కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం అరాచక పాలన నుంచి నాటి హైదరాబాద్‌ సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్‌ 17న జాతీయ జెండా ఎగరిందన్నారు. చరిత్రలో ప్రతీ ప్రత్యేక ఘట్టానికి ఉత్సాహంగా, పండగగా, వేడుకగా జరుపుకుంటాం.. కానీ తెలంగాణలో గత 75 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్ట కరమన్నారు. బీజేపీ గత 25 ఏళ్లుగా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించా లంటూ పోరాటం చేస్తుందని తెలిపారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, నేటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు.కానీ బీజేపీ ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్‌ 17న ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ‘తెలంగాణ విమోచన ఉత్సవాలను’ నిర్వహించామన్నారు. 75 ఏళ్ల క్రితం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత అభినవ సర్దార్‌ పటేల్‌ అమిత్‌ షా చేతుల విూదుగా గతేడాది హైదరాబాద్‌ లో ఉత్సవాలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి బీఆర్‌ఎస్‌ పార్టీ.. చీము నెత్తురుంటే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదేండ్లలో ఎందుకు ఈ విమోచన ఉత్సవాలు జరపలేదు? అని ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? అని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు నిజంగా చీము, నెత్తురు ఉంటే ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుందని అన్నారు. మజ్లిస్‌ పార్టీని సంతృప్తి పరిచేందుకే ఇవాళ కేసీఆర్‌ ఈ ఉత్సవాలను నిర్వహించడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌ కలిసి.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను తప్పుదోవ పట్టించేప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు.ఈ విషయాన్ని గమనించి.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో.. తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని అన్నారు. 


కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నానని తెలిపారు. కేంద్రం అధీనంలో ఈ ఏడాది కూడా పరేడ్‌ గ్రౌండ్లో విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని తెలిపారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తున్నయని తెలిపారు. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్‌ చేసారని అన్నారు. అమిత్‌ షా పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం బీఅర్‌ఎస్‌ కాంగ్రెస్‌ చేస్తున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 17 సాయంత్రం రాష్ట్రపతి భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. విూరు విూటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ సెప్టెంబర్‌ 17 నే ఎందుకు పెట్టుకున్నారు? అని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా కేసీఆర్‌ డుమ్మా కొట్టారని తెలిపారు. ఈ ఏడాది కూడా కేసిఆర్‌ కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తామన్నారు. సీఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలని తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు