శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం
రంగారెడ్డి సెప్టెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగుడ మునిపల్ లో ఉద్రిక్తత శనివారం ఉద్రిక్తత నెలకొంది. తుక్కుగూడ మున్సిపాలిటీ బస్టాండ్ చౌరస్తాకు స్థానికులకే డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. . డబుల్ బెడ్ రూం స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేసారు. పాతబస్తీ మజిలీస్ వారికి ఇవ్వకూడదని పెద్ద ఎత్తున స్థానికులు బిజెపి కార్యకర్తలు రోడ్డుపై కొచ్చి ఆందోళన కి దిగారు. శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అందోళనకారులను అరెస్టు చేశారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్, అందేలా శ్రీరామ్ యాదవ్,బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డి ని పోలీస్ స్టేషన్ కి తరలించారు.