హైదరాబాద్, సెప్టెంబర్ 3, (ఇయ్యాల తెలంగాణ) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్`3 లోని రోవర్ ప్రజ్ఞాన్ తన పనిని పూర్తి చేసినట్లుగా ప్రకటించింది. ఇక దాన్ని తాము సురక్షితంగా పార్క్ చేశామని వెల్లడిరచింది. రోవర్‌కు తాము ఇచ్చిన అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లుగా పేర్కొంది. ఈ మేరకు ఇస్రో చీ లో ఓ పోస్ట్ చేసింది. ‘‘చంద్రయాన్`3 రోవర్ తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసింది. ఇది ఇప్పుడు పార్క్, స్లీప్ మోడ్‌లో సురక్షితంగా సెట్ చేశాం. పేలోడ్‌లు ఏపీఎక్స్‌ఎస్, ఎల్‌ఐబీఎస్ రెండూ టర్న్ ఆఫ్ చేశాం. ఈ పేలోడ్‌ల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి ట్రాన్స్‌మిట్ అయింది. రోవర్ బ్యాటరీ ప్రస్తుతం పూర్తిగా ఛార్జ్ అయి ఉంది. రోవర్ సోలార్ ప్లేట్స్ ను తర్వాతి సన్ లైట్ వచ్చేలా సెట్ చేసి ఉంచాం. మళ్లీ సెప్టెంబర్ 22, 2023న సూర్యోదయం వచ్చినప్పుడు.. సూర్యరశ్మి సోలార్ ప్యానెల్‌లపై పడుతుంది. రిసీవర్ ఆన్‌లో ఉంచాము.
వచ్చే సూర్యోదయానికి రోవర్ మళ్లీ అవేక్ అవుతుందని భావిస్తున్నాం’’ అని ఇస్రో ప్రకటించింది.చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్`3 రోవర్, ల్యాండర్ సరిగ్గా పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ల్యాండర్ ‘విక్రమ్’ రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఇప్పటికీ పని చేస్తున్నాయని తమ మా బృందం ఇప్పుడు ఆ పరికరాలతో చాలా పని చేస్తోందని సోమనాథ్ చెప్పారు. ‘‘రోవర్ ల్యాండర్ నుంచి కనీసం 100 విూటర్ల దూరంలోకి పరిశోధనలు చేయడం గుడ్ న్యూస్. ఇక చంద్రుడిపై రాత్రి కాబోతోంది కాబట్టి, వాటిని డీయాక్టివేట్ చేసే ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించబోతున్నాం’’ అని సోమనాథ్ తెలిపారు. ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్`3 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిరగ్ అయిన సంగతి తెలిసిందే.
0 కామెంట్‌లు