Ticker

6/recent/ticker-posts

Ad Code

September 7న - Korivi - కృష్ణస్వామి Mudiraj-130వ జయంతి వేడుకలు


హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఇయ్యాల తెలంగాణ) :  తొలి హైదరాబాద్ మాజీ మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130వ జయంతి వేడుకలను ఈ నెల 7వ తేదీన  ఘనంగా నిర్వహించ నున్నట్లు పొట్లకాయ వెంకటేశ్వర్లు ముదిరాజ్ తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీన ముదిరాజ్ భవన్ లో  కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130జయంతి వేడుకలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం  అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారని తెలిపారు. అదేవిధంగా  కొరవి కృష్ణ స్వామి ముదిరాజ్ పేరు మీద కొంతమంది ముదిరాజ్ సంఘం సేవలందించిన ముదిరాజులకు సన్మానం చేయడం జరుగుతుందని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొడ్ల సదానంద ముదిరాజ్ గొడుగు ఆంజనేయులు ముదిరాజ్ దివాకర్ ముదిరాజ్ మోహన్ రావు ముదిరాజ్ పొట్లకాయ వెంకటేశ్వర్లు ముదిరాజ్ మంద శ్రీనివాసులు ముదిరాజ్  తదితరులు పాల్గొననున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు