Ticker

6/recent/ticker-posts

Ad Code

SEPTEMBER 17న ALL PARTY విూటింగ్‌

న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 13 (ఇయ్యాల తెలంగాణ ):ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి. అయితే ఇంత వరకూ ఈ సమావేశాల అజెండా ఏంటో మోదీ సర్కార్‌ ప్రకటించలేదు. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 17వ తేదీన అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక సమావేశాల అజెండాపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ‘‘సెప్టెంబర్‌ 18 నుం చి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 17న సాయంత్రం 4.30 గంటలకు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆయా పార్టీల నేతలకు ఈ సమాచారం అందించాం’’` ప్రహ్లాద్‌ జోషి,  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటని ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రశ్నించింది. అంతే కాదు. వినాయక చవితి రోజునే పార్లమెంట్‌ సమావేశాలకు పిలవడమేంటని మండి పడిరది. ఔఅఖ నేతలూ సమావేశాలు నిర్వహిస్తున్న తేదీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇండియాలోనే ప్రముఖ పండుగైన వినాయక చవితి రోజున పార్లమెంట్‌ సమావేశాలు పెట్టడమేంటి..? ఇది కచ్చితంగా హిందూ మనోభావాలను దెబ్బ తీయడమే. అసలు ఆ తేదీలు చూసే మేం షాక్‌కి గురయ్యాం’’` సుప్రియా సూలే, ఎన్‌సీపీ నేతవిశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాల్లో అమృత్‌ కాల్‌ గురించి చర్చించనుంది. అదే సమయంలో భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే అంశంపైనా చర్చ జరగనుందని సమాచారం. చంద్రయాన్‌`3 మిషన్‌ సక్సెస్‌ అవడం, ఉ20 సమ్మిట్‌పైనా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇండియా పేరుని భారత్‌గా మార్చే విషయంపైనా వాడివేడి చర్చ జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీనిపై వివాదం జరుగుతోంది. ఉ20 సమావేశాల్లోనే కేంద్రం భారత్‌ పేరుని ప్రమోట్‌ చేసింది. దీనిపై ఈ ప్రత్యేక సమావేశాల్లో ఓ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

  1. అబ్బో ప్రతిపక్షాలకు బాగానే ప్రేమ పుట్టుకొచ్చింది హిందువుల పైనా ?

    రిప్లయితొలగించండి