యశంకర్ భూపాలపల్లి (ఇయ్యాల తెలంగాణ ): సెప్టెంబర్ 15న జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో టెట్ పరీక్ష నిర్వహణ పై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ టెట్ పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సెప్టెంబర్ 15న ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు రెండవ పేపర్ ఉంటుందని కలెక్టర్ అన్నారు. టెట్ పరీక్షల కోసం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 6 పరీక్షా కేంద్రాలుప్రభుత్వ జూనియర్ కళాశాల సంఘమిత్ర పిజిడి డిగ్రీ కాలేజ్ శ్రీ చైతన్య పీజీ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తేజస్విని( గాంధీ) జూనియర్ కళాశాల జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాల లో ఏర్పాటు చేసామని ఉదయం నిర్వహించే మొదటి పరీక్షకు 1421 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం నిర్వహించే రెండవ పరీక్షకు 1178 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రం సవిూపంలో జిరాక్స్ షాపులు మూసివేయాలని అన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఫస్ట్ ఏడ్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద త్రాగునీటి సౌకర్యం ఉండే విధంగా ఉండాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాల వద్దకు బస్సులు ఏర్పాటు చేయాలని, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం ప్రహరి గోడల వద్ద సైతం భద్రత ఏర్పాటు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ లీకేజి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , అదనపు అదనపు ఎస్పీ రమేష్ , సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.భూపాలపల్లి లో 2599 అభ్యర్థుల కోసం 6 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పనIటెట్ పరీక్షల నిర్వహణ పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ భూపాలపల్లి లో 2599 అభ్యర్థుల కోసం 6 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
0 కామెంట్‌లు