మంథని సెప్టెంబర్ 5 (ఇయ్యాల తెలంగాణ ): ఎస్సీ 57 ఉపకులాలకు దళిత బంధు అందేలా చూడాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బాణాల రాజా రామ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గడ్డం మారుతి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ను కలిసి విన్నవించారు . ఎస్సీ 57 ఉప కులాలు ప్రభుత్వ పథకాలు అందక దారిద్ర రేఖకు దిగువన దీవిస్తున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టే దళిత బంధు పథకంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం కుమార్, ముత్తారం మండల అధ్యక్షులు గడ్డం భూషణం, గడ్డం శ్రీహరి, గడ్డం రవీందర్, గడ్డం శ్రీనివాస్, గడ్డం శివ, గడ్డం శంకర్, గడ్డం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు