Ticker

6/recent/ticker-posts

Ad Code

సైలెన్సర్లనుRoad Roller తో తొక్కించిన పోలీసులు


నిర్మల్‌,సెప్టెంబర్ 05 (ఇయ్యాల తెలంగాణ) : నిర్మల్‌ జిల్లా కేంద్రంలో అధిక శబ్దంతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు కొరడ దులిపించారు. ఇటీవల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి బుల్లెట్‌ వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు... జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌ లో సుమారు 50 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌ తో తొక్కించి నుజ్జు నుజ్జు చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి మాట్లాడుతూ  బుల్లెట్‌ వాహనాలకు సైలెన్సర్‌ లను మార్పిడి చేయించి అధిక శబ్దంతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటారు వాహనాల సైలెన్సర్ల మార్పిడిపై అవగాహన కల్పించేందుకే ఈ చర్య చేపట్టినట్టు తెలిపారు. ఇందులో పట్టణ సీఐ పురుషోత్తం చారి, ట్రాఫిక్‌ ఎస్సై దేవేందర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు