హైదరాబాద్,సెప్టెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : ఎలుకలు వంటలు చేయడం వినాయకుడు ఎం చక్క భోజనం ఆరగించడం, అమ్మ చేతి గోరు ముద్దలు తినడం, రక రకాల పిండి వంటలు, జిలేబి, స్వీట్స్ అనేక రకాల మిటాయిలు ఇదంతా జరుగుతోంది ఎక్కడో కాదు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ లోని సెంటర్ సిటీగా పేరు గాంచిన ఆబిడ్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టు కుంటున్నాయి. ఎలుకలు చక చకా జిలెబీలు మోసుకుంటూ వెళ్లడం ఒక దగ్గర ఎలుక జిలెబీలు వండుతుండడం, మరో చోట స్వీట్ సిద్ధం చేస్తూ ఉండడం అనేక రకాల వంటకాలు సిద్ధం చేస్తూ ఉన్న దృశ్యాలు ఆహా ఎంతటి అద్భుతం అనేలా అనిపిస్తున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అనేక చోట్ల ఏర్పాటు చేసిన వినాయక మండపాల ప్రతి రూపాల్లో అబిడ్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎలుకల వంటలు వినాయకుని భోజనం బహు ముచ్చటగా అనిపిస్తోంది.
![]() |
జాంగ్రీలు మోసుకెళుతున్న మూషికలు |
పక్కనే సంతోష్ ధాబాకు వస్తున్న భోజన ప్రియులంతా ఇక్కడ కొలువు దీరిన వినాయకుడిని చూసి వావ్ అని సంబర పది పోతున్నారు. ఇక చిన్న పిల్లల అనడానికైతే అవధులు లేకుండా పోతున్నాయి ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను చూసి చూపు మరల్చలేక పోతున్నారు. పిల్లలతో కలసి ఎం చక్కా ఎంజాయ్ చేయాలంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి చూసి రండి మరి ! అసలే 4 రోజులే ఇంకా గణేష్ నిమజ్జనం జరగనుంది. తొందరగా వెళ్ళండి. అబిడ్స్ లోని సంతోష్, స్వప్న సినిమా హాళ్లు ఎదురుగా ఉన్న గల్లీ లోపల సంతోష్ దాబా పక్కనే ఈ ఎలుకలు వినాయక విగ్రహాలు ఉన్నాయి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి దర్శనమ్ చేసుకోండి.
0 కామెంట్‌లు