Ticker

6/recent/ticker-posts

Ad Code

అసదుద్దీన్‌ మాటలు కుక్క మొరిగినట్లు వుంది TPCC నేత నిరంజన్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ): గల్లీ లోని కుక్క గల్లీలోనే మొరుగుతుంది. ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడిన మాటలు కుక్క మొరిగినట్టు ఉందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ విమర్శించారు. హైదరాబాద్‌ లో రాహుల్‌ గాంధీ పోటీ చేయాలని అసద్‌ అంటున్నాడు.. రాహుల్‌ ఇక్కడ పోటీ చేస్తే అసద్‌ ఓటమి తప్పదు. అసద్‌ కుటుంబం, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ ముస్లింలకు రాహుల్‌ గాంధీ విూద కాంగ్రెస్‌ పార్టీ విూద అభిమానం, ప్రేమ ఉంది. విూరు ముస్లింలకు గానీ పాత బస్తి అభివృద్ధి కి ఏమి చేయలేదని ముస్లింలు గమనించారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తో దేశంలో ప్రేమ పంచి అభిమానం స్వంతం చేసుకున్నాడు. కాంగ్రెస్‌ వల్లనే విూరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు. మోడీ మెప్పుకోసం అసదుద్దీన్‌ ఇలా మాట్లాడుతున్నారు. బాబ్రీ మసీదు కూల్చినపుడు ఉత్తర ప్రదేశ్‌ లో కళ్యాణ్‌ సింగ్‌ బీజేపీ ప్రభుత్వం ఉందన్న విషయం అసద్‌ కు తెలియదా.. బీజేపీ మెప్పుకోసం అసద్‌ అన్ని రకాలుగా కష్టపడుతున్నారని అన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు