మూసీనదికి పెరిగిన వరద ప్రవాహం
హైదరాబాద్ సెప్టెంబర్ 6 (
ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ నుంచి లంగర్‌హౌజ్ వెళ్లే వంద ఫీట్ల రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ వరద ఉధృతితో వంద ఫీట్ల రోడ్డుపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆ రహదారి వైపునకు వాహనాలకు అనుమతించడం లేదు. మూసీ పరివాహ ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు.హిమాయత్ సాగర్‌కు 4 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 6 గేట్లు ఎత్తారు. మూసీలోకి 4,120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
హిమాయత్ సాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉంది.ఉస్మాన్ సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 2,200 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1789.90 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులుగా ఉంది. ఈ జలాశయం 6 గేట్లు ఎత్తి మూసీలోకి 2,028 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
0 కామెంట్‌లు