న్యూఢల్లీ, సెప్టెంబర్ 5 (ఇయ్యాల తెలంగాణ ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సోమవారం రోజు తన నివాసంలో ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులు జాతీయ పురస్కారాలకు ఎంపికైనట్లు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారికి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందించారు.
0 కామెంట్‌లు