హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : ప్రతి సమగర మొచీ కార్మికులకు 100% దళిత బంధు పథకాన్ని అందించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ లెదర్ వర్కర్స్ ఫేడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం నాడు ఆయన హైదరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిగిటివ్ డైరెక్టర్ రమేష్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోని పాదరక్షలు తయారి చేసే సమగర,మోచీ ఉప కులాల కార్మిక కుటుంబాలకు ఇప్పటి వరకు దళిత బంధు పథకాన్ని అందిచలేదని అన్నారు. కేవలం హైదరాబాద్ నగరంలోని బహుదూర్ పురా నియోజకవర్గంలోనే ఈ ఉపకులాల వారికి సంపూర్ణంగా దళిత బంధు అందినట్టుగా ఆయన పేర్కొన్నారు. మిగితా 118 నియోజకవర్గాలలో దళిత బంధు పధకము అందని ద్రాక్షలా అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపకులాల కుటుంబాల అభివ్రృద్ది లో విఫలమైందన్నారు. కేవలం అధికార పార్టీలకు చెందిన వారికే దళిత బంధు మంజురి చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరం లోని వేలాది మంది సమగర, మోచీ చర్మకార కార్మికులు నగర పుట్ పాత్ లపై దుర్భర జీవితాలను గడుపు తున్నారని, అలాంటి పేదవారిని గుర్తించి వారి కుటుంబాలను నిలబెట్టడానికి ఖచ్చితంగా వారికి దళిత బంధు పథకాన్ని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుదూర్ పురా నియోజకవర్గంలో ఎస్సీ లందరికి సంపూర్ణంగా అందజేసినందుకు ఈడి రమేశ్ అభినందించి నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఏస్సీ ఉపకులాల కుటుంబాలపై ప్రభుత్వం సవతి తల్లీ ప్రేమ ప్రేమ చూపించకుండా అన్ని విధాల వారి అభివృద్ది కొరకు ప్రత్యేక అభివృద్ది కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర నాయకులు మారుతి గైక్వాడ్,బలరాం ఉత్కార్ నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు