Ticker

6/recent/ticker-posts

Ad Code

బిఫాం తప్పకుండా నాకే వస్తది MLA రాజయ్య


జనగామ సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ):జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వడ్డిచర్లలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విూడియాతో మాట్లాడారు.  ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధర్బంలో కార్యకర్తలు ఆదోళనలు చెందొద్దని సిఎం కేటిఆర్‌ 115 టికెట్లు కేటాయించడం జరిగింది. నివేదికలు, సర్వే రిపోర్ట్‌ లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పడం జరిగింది.  కేటాయించిన స్థాలలో ఎక్కడ కూడా  బి ఫామ్‌ లు ఇవ్వలేదు.  కొన్ని నియోజక వర్గాలలో డిస్టబెన్స్‌ జరుగున్నాయి.  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విదేశాలకు వెల్లేటప్పుడు కలవడం జరిగింది.  చాలా బాగా పనిచేస్తున్నవ్‌, టికెట్‌ నీకే అని హావిూ ఇవ్వడం జరిగింది.  టికెట్లు ప్రకటించే సమయంలో కేటిఆర్‌ లేకపోవడంతో రెండు రోజుల క్రితం వెళ్లి కలవడం జరిగింది.  ఎమ్మెల్సీగాని,ఎంపి గానీ అవకాశం ఉంది.  అప్పటివరకు స్టేట్‌ కార్పోరేషన్‌ నామినేషన్‌ పదవి తీసుకొని అని చెప్పడం జరిగింది.  అదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కలిసి ఫోటోలు దిగడం జరిగింది.  ఆ ఫోటోకు ఊహా గానాలు చేయడంతో,విూడియాలో వచ్చిన కథనాలకు రకారకాలుగా కార్యకర్తల్లో  ఆంధోళన నెలకొందని అయన అన్నారు.

గత పదిహేను రోజుల క్రితం  వరంగల్‌ ల్లో మాదిగ చమర్‌ ఇంటలెక్షర్స్‌ ఫోరంలో వరంగల్‌ లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు రాజయ్య కాంగ్రెస్‌ పార్టీలోకి వెల్తున్నారని కథనాలు రాయడం జరిగింది.. గత 2014 లో ఎంపి అభ్యర్థిగా కడియం,ఎమ్మెల్యేగా నేను అధిస్టానం నిర్ణయం ప్రకారం కలిసి పని చేయటం జరిగింది.  అధిస్టానానికి నిర్ణయానికి కట్టుబడి ఉందాం.  జనవరి 17 వరకు ఎమ్మెల్యే గా ఉంటా,ప్రోటోకాల్‌ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలల్లో పాల్గొనాలి  కార్యకర్తలు నిలకడగా ఉండండి. కేటిఆర్‌ తో నాకు సంభాషన జరిగింది.  దాన్ని వక్రీకరించడాన్ని ప్రెస్‌ ముఖంగా ఖండిస్తున్న  బిఫాం తప్పకుండా నాకే వస్తది.  ఒక వేళ టికెట్‌ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు