Ticker

6/recent/ticker-posts

Ad Code

’’MLA’’ల బంధుగా మారిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు

 


‘‘దళిత బంధు’’కు పారదర్శకత వర్తించదా...! 
మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలి 

ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే గ్రౌండిరగ్‌ పూర్తి చేయాలి. 

తెలంగాణలో అత్యధికంగా దగా పడిరది దళిత సమాజమే

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శ 

జగిత్యాల 

:గృహాలక్ష్మి,  బీసీ , మైనార్టీ , దళిత బంధు అనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల బంధుగా మారిందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ,కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేవలం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకే కాకుండా  కంప్యూటర్‌ ఆధారిత అర్హుల ఎంపిక అన్ని పథకాలకు వర్తింపజేయాలని జీవన్‌ రెడ్డి ప్రభుత్వాన్నీ డిమాండ్‌ చేశారు.రాబోయే ఎన్నికల లోపేదళిత బంధు గ్రౌండిరగ్‌ చేయకుండ దళితులను ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం లబ్దిదారుల ఎంపికలో ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండ, అవినీతికి తావులేకుండ పారదర్శకత కోసం కంప్యూటర్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని చెబుతున్న మంత్రి కేటీఆర్‌ పారదర్శకత కేవలం డబుల్‌ బెడ్‌ రూం పథకానికేనా..అన్ని సంక్షేమ పథకాలకు వర్తిస్తుందా లేదా మంత్రి సమాధానం చెప్పాలన్నారు.కాంగ్రెస్‌ పాలనలో అర్హులందరికి ఇళ్ల కేటాయింపు, స్థల సేకరణ చేపట్టామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్‌ బెడ్‌ రూం పథకం కనుమరుగైందని,  ప్రస్తుతం పంపిణీ చేస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు బీఆర్‌ఎస్‌ మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించినవేనన్నారు. ఇంటి నిర్మాణ వ్యయం పదేళ్లలో రెట్టింపు కాగా, స్వంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పేరిట రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని రూ. 3లక్షలకు కుదించారనీ విమర్శించారు. 

2022`23లో స్వంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి నియోజకవర్గంలో 3000 ఇళ్ల నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లు కేటాయించి, బడ్జెట్లో ఆమోదించినా  ఒక్క ఇల్లు నిర్మించక రూపాయి కూడా ఖర్చు చేయలేదని జీవన్‌ రెడ్డి విమర్శించారు.అలాగే2023`24లో సైతం మరోమారు స్వంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారి కోసం రూ.12 వేల కోట్లు కేటాయించినా, ఆచరణ ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అత్యధికంగా దగా చేయబడిరది దళిత సమాజమేనని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ దళితులకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ తోపాటు జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాల్లో సైతం నిధులు కేటాయించాలని పేర్కొన్నారని ఈ మేరకు దళితుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి, బడ్జెట్లో ఆమోదించిన రూ.40వేల కోట్ల నిధులను వెచ్చించకుండ దళితుల హక్కులు కాలరాశారని విమర్శించారు. దళితబంధు పథకం అర్హుల ఎంపిక ప్రక్రియలో కలెక్టర్‌ తోపాటు ప్రజాప్రతినిధులని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసి రెండున్నర నెలలు గుడుస్తున్నా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు అంటే  ఎమ్మెల్యేనా..ఎంపీయా.. సర్పంచా ఎవరో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.దళిత బంధు అర్హుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించేలా దరఖాస్తులు ఎక్కడ స్వీకరిస్తారు.. గ్రామ సభ ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేస్తారా.. ఎంపిక ప్రక్రియలో జిల్లా కలెక్టర్‌ పాత్ర ఏమిటీ.. వంటి అంశాలపై కలెక్టర్‌ పత్రికాముఖంగా ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కోరారు. దళిత బంధు ఎంపికలో వితంతువులు, ఒంటరి మహిళలకు, ఇప్పటి వరకు లబ్ధి పొందని కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలనీ డిమాండ్‌ చేశారు. ఎస్సీ , బీసీ , మైనార్టీ సెల్‌ స్వయం ఉపాధి పథకాలకు నిధులు మంజూరు చేయడం నిలిపివేశారని ఆరోపించారు. 

 సంక్షేమ పథకం కావాలంటే  అర్హులు ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఎద్దేవా చేస్తూనే ఇదేనా పారదర్శకత.. ఇదేనా ప్రజాస్వామ్యం.. బీసీ బంధు, మైనార్టీ బంధుకు పారదర్శకత వర్తించదా అని జీవన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక కోసం ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా కంప్యూటర్‌ ఆధారిత ఎంపిక చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని  డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు బండ శంకర్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దర రమేశ్‌ బాబు, కాంగ్రెస్‌  కార్మిక విభాగం జిల్లా  అధ్యక్షుడు బొల్లి శేఖర్‌, సీనియర్‌ నాయకులు తాటిపర్తి దేవేందర్రెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్‌ నక్క జీవన్‌, కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సిరాజాద్దీన్‌ మస్సూర్‌, నాయకులు దాసరి సతీశ్‌, నక్క రమేశ్‌, దులూరి సాయి, చందా రాధాకిషన్‌,మహిపాల్‌ , కాంగ్రెస్‌ పార్టీ జగిత్యాల రూరల్‌ మండలాధ్యక్షుడు జున్ను రాజేందర్‌, బండారు స్వామి, జిల్లా మత్స్యశాఖ విభాగం అధ్యక్షుడు తోపారపు రజనీకాంత్‌, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండా మధు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు