Ticker

6/recent/ticker-posts

Ad Code

LUCKNOW స్టేడియానికి శివశక్తి పేరు


లక్నో, సెప్టెంబర్‌ 23, (ఇయ్యాల తెలంగాణ ); ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ మైదాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రధాని సొంత నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయిలో మైదానాన్ని నిర్మిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు క్రికెట్‌ లెజెండ్స్‌ రవి శాస్త్రి, సచిన్‌ టెండూల్కర్‌, సునీల్‌ గవాస్కర్‌, దిలీప్‌ గవాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.కేంద్రం చెబుతున్న వివరాల ప్రకారం...30 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియం నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.450 కోట్లు ఖర్చు పెడుతోంది. శివుడి స్ఫూర్తితోనే ఈ మైదానాన్ని నిర్మిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. నెలవంక ఆకారంలో రూఫ్‌ కవర్‌లు, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్‌ లైట్స్‌, ఘాట్‌ స్టెప్స్‌ ఆకృతిలో సీటింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 30 వేల మంది ఆడియెన్స్‌ కూర్చుని మ్యాచ్‌ని చూసేందుకు వీలుగా నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రకంగా మరోసారి తన సొంత నియోజకవర్గమైన వారణాసికి వచ్చే అవకాశం దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌ 3 గురించి మరోసారి ప్రస్తావించారు. భారత్‌ రోవర్‌ చంద్రుడిపై దిగి నెల రోజులవుతోందని గుర్తు చేశారు. ‘‘ఈ రకంగా వారణాసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ్టికి చంద్రయాన్‌ 3 మిషన్‌ సక్సెస్‌ అయి నెల రోజులవుతోంది. రోవర్‌ శివశక్తి పాయింట్‌కి చేరుకుంది. చంద్రుడిపై ఓ శివశక్తి పాయింట్‌ ఉంటే ఈ కాశీలో మరో శివశక్తి పాయింట్‌ సిద్ధమవుతోంది. ఈ మైదానమే శివశక్తి పాయింట్‌. ఈ మైదానానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ఆ మహాదేవుని నగరంలో నిర్మించిన ఈ మైదానాన్ని ఆ శివుడికే అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మైదానం ద్వారా ఎంతో మంది క్రీడాకారులకు మేలు జరుగుతుందని అన్నారు. శంకుస్థాపన చేయడంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా మాట్లాడారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగానే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఇది సాధ్యమైంని ప్రశంసించారు. యూపీలో ఇది మూడో అంతర్జాతీయ మైదానం అని చెప్పిన యోగి ఆదిత్యనాథ్‌, ఃఅఅఎ సూపర్‌విజన్‌లో కడుతున్న తొలి స్టేడియం అని స్పష్టం చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు