చాగలమర్రి
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో ప్రతి ఇంట్లో చిన్నారులకు కృష్ణుని వేశధారణ వేయించి దేవాలయం వెళ్లి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణుని వేషం లో ఉన్న తొమ్మండ్రు దేవాన్స్ , రాధ గోపికల వేశాదారణలో ఉన్న దుర్విక్ , శ్రీ లాస్య చిన్నారులను చాలా చక్కగా అలంకరించారు. అదే విధంగా గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా రెండ్రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువా, గారెలు వంటివి తయారుచేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారుచేసిన ‘అడిది’ పేరుగల మిఠాయిలు తయారుచేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాసదీక్షలు పాటిస్తారు.
అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం వూయలలో ఉంచి భక్తి, జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రైప్రూట్స్తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతీ, యువకులు అందరూ కలిసి ఉట్టికొట్టే కార్యక్రమం ఆశ్రమంలో నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా, పురుషులు ప్రత్యేక నృత్యప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీహండీని పగులగొట్టిస్తారు. అనంతరం రేపు ఉదయం వంటలు చేసుకొని భోజనాన్ని ఆరగిస్తారు.