హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. వేల మంది భక్తుల నడుమ గణేష్ శోభాయాత్రలు ఘనంగా సాగుతుండగా.. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి అయింది. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడిని చేరాడు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద బుధవారం అర్ధరాత్రి దర్శనాలు నిలిపేశారు. రాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించారు. గురువారం వేకువ జామునే ఖైరతాబాద్ పార్వతీ తనయుడి విగ్రహాన్ని తరలించడం ప్రారంభించారు. వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీఏ తరఫున 2 వేల వాహనాలు, జీహెచ్‌ఎంసీ 250కిపైగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు మూడు వేల మంది సిబ్బందిని నియమించారు. 50 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనానికి హుసేన్ సాగర్‌తో పాటు 33 చెరువులను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇక్కడ 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్‌ఎఫ్ బృందాలను రెడీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా వంద వరకు కృత్రిమ చెరువులు నిర్మించారు.నిమజ్జనం సందర్భంగా రాత్రి రెండు గంటల వరకు మెట్రో సర్వీస్‌లు పొడిగించారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్, పీవీ మార్గ్ పరిసరాల్లో ఉన్న పార్కులన్నీ మూసివేస్తున్నారు. వినాయకుడి శోభాయాత్రలు జరిగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన శోభాయాత్రతో పాటు, ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది.చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద వాహనాలను డైవెర్ట్ చేశారు. కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట కూడలి వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పైకి అనుమతి ఉండదు. సికింద్రాబాద్‌లో సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద వాహనాలను మళ్లిస్తున్నారు. టోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ కూడలి, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ మైదానం సవిూపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాల మళ్లించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత నిర్వాహకులు ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ విూదుగా తీసుకెళ్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ విూదుగా వెళ్తున్నాయి.
బైబిల్ హౌజ్ రైల్ ఓవర్ బ్రిడ్డి విూదుగా లారీలను అనుమతించడం లేదుఎటూ చూసిన జనసంద్రమేఎటు చూసినా జనసంద్రమే.. ఇసుకేస్తే రాలనంత జనంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. ఖైరతాబాద్ గణేశ్ ఎదుట భక్తులతో పాటు.. పోలీసులు కూడా డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఇదిలాఉంటే.. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు మొత్తం 100 ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు 10వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.వినాయక నిమజ్జనాలు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో 40వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేల 600 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవడంతో పాటు.. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గణేశ్ శోభాయాత్రల సందడి కనిపిస్తోంది. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్, కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు దగ్గర వినాయక నిమజ్జనాలు భారీగా కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌పై ఆంక్షలు పెట్టారు పోలీసులు. బాలాపూర్` హుస్సేన్ సాగర్ మార్గంలో సాధారణ వాహనాలపై శుక్రవారం ఉదయం పదిగంటల వరకు ఆంక్షలు విధించారు.పోలీసుల డ్యాన్సులుహైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు సందడిగా మారింది. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది. ఖైరతాబాద్ గణేష్ ఎదుట భక్తులతో పాటు పోలీసులు కూడా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. భక్తులతో కలిసి తీన్ మార్ స్టెప్పులు వేస్తూ అందరిని ఆకర్షించారు. పోలీసులు అందరూ ప్రజలతో మమేకమై డ్యాన్సుల చేస్తుంటే అక్కడి వచ్చిన వారందరూ ఆశక్తిగా పోలీసులు చేస్తున్న డ్యాన్స్ ను ఆనందంగా తలికించారు. పోలీసులు ఫుల్ జోస్ లో తీన్ మార్ డబ్బులకు స్టెప్పులు వేస్తూ ఆనందంగా గడిపారు. పోలీసులను చూసిన అక్కడి జనం బాసూ విూరు మ..మ.. మాస్ పోలీస్.. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విజిల్స్ వేస్తూ పోలీసులకు ఉత్సాహాన్ని నింపిన తీరు ఆహ్లాద వాతావరణం నింపింది.
0 కామెంట్‌లు