Ticker

6/recent/ticker-posts

Ad Code

ISRO... వీనస్‌ మిషన్‌ ! భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO ఆదిత్య ఎల్‌`1


బెంగళూరు, సెప్టెంబర్‌ 28, (ఇయ్యాల తెలంగాణ) : అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతోంది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. చంద్రయాన్‌`3తో జాబిల్లిపై జెండా ఎగురవేసింది. మూన్‌పై అడుగుపెట్టి.. విక్రమ్‌ లాండర్‌ను  చంద్రుడి దక్షిణ ధృవంపై దింపి.. చరిత్ర తిరగరాసింది. చంద్రుడి తర్వాత సూర్యుడిపై ఫోకస్‌ పెట్టింది. ఆదిత్య ఎల్‌`1ను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు శుక్రుడిని  సోధించేందుకు సిద్ధమవుతోంది. శుక్రగ్రహంపై పరిశోధనలకు త్వరలోనే వీనస్‌ మిషన్‌ చేపడతామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు  పేలోడ్లు అభివృద్ధి చేసినట్టు ఆయన తెలిపారు. ఢల్లీిలోని ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడవిూని ఉద్దేశించి మాట్లాడిన ఇస్రో చైర్మన్‌ సోమ్నాథ్‌... వీనస్‌ మిషన్‌ను చేపడతామని  ప్రకటించారు. శుక్రుడు... సూర్యుడి నుంచి రెండో గ్రహం. సౌరవ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. దీనిని ఎర్త్‌ సిస్టర్‌ ప్లానెట్‌ అని కూడా అంటారు. 


శుక్కుడిపై పూర్తిగా మందపాటి  కార్బన్‌ డైయాక్సైడ్‌ వాతావరణం ఉంటుంది. చూట్టూ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ మేఘాలతో కప్పబడి ఉంటుంది.. అందుకే దీనిని వీల్డ్‌ ప్లానెట్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇది లేత  పసుపు రంగులో కనిపిస్తుంది. అంతేకాదు.. శుక్రుడు సౌరవ్యవస్థలో అత్యంత వేడి గ్రహం. సవ్యదిశలో తిరుగుతూ ఉంటుంది. శుక్రగ్రహాన్ని పరిశోధించడం వల్ల.. అంతరిక్ష శాస్త్ర  రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. శుక్రగ్రహం చాలా ఆసక్తికరమైన గ్రహమని.. దానిపై వాతావరణం చాలా మందంగా  ఉందన్నారు. అంతేకాదు శుక్కుడిపై వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువని అన్నారు. 10వేల సంవత్సరాల తర్వాత భూమి లక్షణాలు కూడా మారిపోవచ్చని.. భూమి కూడా ఏదో ఒకరోజు శుక్రుడులా కావచ్చని అన్నారు ఇస్రో చైర్మన్‌. నాసా కూడా 2029, 2030, 2031లో వీనస్‌ మిషన్లు చేపట్టే అవకాశం ఉంది. చంద్రయాన్‌`3 విజయవంతమైన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న సూర్యునిపై అధ్యయనం  చేసేందుకు భారతదేశపు తొలి అంతరిక్ష ఆధారిత మిషన్‌ ఆదిత్య ఎల్‌`1 అంతరిక్ష నౌకను ఇస్రో ప్రయోగించింది. అనంతరం ఇస్రో వీనస్‌ మిషన్‌ పై దృష్టి సారించనుంది.

నిద్రయాన్‌ నుంచి బయిటకు రాని చంద్రయాన్‌

చంద్రయాన్‌బి3 మిషన్‌ ద్వారా చంద్రుడి గుట్టు మట్లు తెలుసుకునేందుకు ఇస్రో ఉపయోగించిన ల్యాండర్‌, రోవర్‌ మేల్కొనే అవకాశాలు కనిపించడం లేదు. చంద్రుడి దక్షిణ ధ్రువం విూద ఉన్న ఈ రెండూ.. ఈనెల 22న సూర్యోదయం అయిన నేపథ్యంలో అవి మేల్కొంటాయని శాస్త్రవేత్తలు భావించారు. అనుసంధానమయ్యే అన్ని ప్రయత్నాలు చేశారు. అప్పటికీ సానుకూల ఫలితాలు రావడం లేదు. మిషన్‌ లో ప్రయోగించిన పరికరాలు అక్కడి అతి శీతల పరిస్థితులను తట్టుకోలేకపోతున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సమయం గడిచేకొద్దీ అక్కడ అవకాశాలు మందగిస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘‘ఈ ప్రయోగం గొప్ప అనుభూతిని ఇచ్చింది. చంద్రుడి దక్షిణ ధృవం విూద ల్యాండర్‌, రోవర్‌ దిగడం ఆనందాన్నిచ్చింది. ఇలా దక్షిణ ధృవం విూద జెండా పాతిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం చంద్రుడి విూద అతి శీతల వాతావరణముంది. సూర్యోదయం అయినప్పటికీ ఆ పరికరాలు సహకరించడం లేదు.. అయితే అవి అనుసంధానం కాకపోవడం ఒకింత బాధ అనిపించినప్పటికీ..ఈ మిషన్‌ అఖండ విజయమని’’ ఇస్రో మాజీ అధిపతి కిరణ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.జాబిల్లి పై నిద్రావస్థలో ఉన్న చంద్రయాన్‌బి3ని మేల్కొల్పడానికి ఇస్రో కసరత్తు ప్రారంభించింది. అక్కడ ఉన్న విక్రం ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ ను తిరిగి పని చేయించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. 

బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో గడచిన గురువారం సాయంత్రం నుంచి ఈ సన్నాహాల్లో తల మునకలయ్యారు. చంద్రయాన్‌బి3 చంద్రుడిపై ల్యాండ్‌ అయిన తర్వాత ల్యాండర్‌, రోవర్‌ అక్కడ ఒక మూన్‌ డే(భూమిపై 14 రోజులు) పాటు పనిచేశాయి. సూర్యాస్తమయానికి ముందు అంటే ఈ నెల రెండున ప్రజ్ఞాన్‌ రోవర్‌ ను, నాలుగున ల్యాండర్‌ ను ఇస్రో నిద్రాణ స్థితి ( స్లీప్‌ మోడ్‌) లోకి పంపింది. అక్కడ మూన్‌ నైట్‌ ముగిసినప్పటికీ ల్యాండర్‌, రోవర్‌ నిద్రాణ స్థితి నుంచి మేల్కోవడం లేదు.వాస్తవానికి నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్‌ బి2 మిషన్‌ లో భాగంగా రోదసీలోకి దూసుకుపోయి 3.84 లక్షల కిలోవిూటర్ల దూరాన్ని అధిగమించి జాబిల్లిని ముద్దాడే క్రమంలో ఇస్రో ఓటమిపాలైంది. అయితే దీన్ని సవాల్‌ గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌బి3 లో పంపించిన ల్యాండర్‌ కు విక్రమ్‌ అని, రోవర్‌ కు ప్రజ్ఞాన్‌ అని అప్పటి పేర్లే పెట్టారు. పొరపాటు అనే మాటకు తావు ఇవ్వకుండా విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ దర్జాగా తమ పని చేసుకుని పోయాయి. అమెరికా, చైనా, రష్యాకు సాధ్యం కాని పనిని సులువుగా చేసేసాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం విూద సాఫ్ట్‌ గా లాండ్‌ ప్రక్రియను చేపట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. గతంలో అమెరికా, చైనా, రష్యా మాత్రమే తమ వ్యోమ నౌకలను సురక్షితంగా చంద్రుడి విూదకు దించాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు