హైదరాబాద్, సెప్టెంబర్ 1, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ బెడద పీడిస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నప్పటికీ తెలంగాణలోకి డ్రగ్స్ రవాణా వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఆగస్టు 31 గురువారం నాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసుల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంకట్ బాలాజీ మురళి తో పాటు ఇద్దరు యువతులను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నారు. సినిమా లింకులతో ఉన్న డ్రగ్స్ పార్టీ అవ్వడం వల్ల పెద్ద సంచలనంగా మారింది. దాంతోపాటే గురువారం ఒక్కరోజే హైదరాబాదులో రెండు డ్రగ్ కేసులు నమోదయ్యాయి.
ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ నుంచి 2.8 గ్రాముల కోకైన్, 6 ఎల్ ఎస్ డి బోల్ట్, 25 ఎస్టాకి పిల్స్ , 72,000 నగదు, ఐదు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. తరచూ ఫ్రేష్ లివింగ్ అపార్ట్మెంట్ లో బాలాజీ పార్టీలు నిర్వహిస్తున్నట్టు తేలింది. హైదరాబాద్ బెంగళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్లతో బాలాజీకి సంబంధాలు ఉన్నట్టు బాలాజీ ఒప్పుకున్నాడు. నైజీరియన్లతో బాలాజీకి నేరుగా సంబంధాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తీసుకువచ్చి విక్రయిస్తున్నడు బాలాజీ.వెంకట్ సాయంతో సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. బాలాజీ నలుగురు వ్యక్తుల నుంచి తరచూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ రెగ్యులర్ గా డ్రగ్స్ వాడే అలవాటు ఉంది. ఇద్దరు కలిసి తరచూ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో డ్రగ్ పార్టీలో అమ్మాయిలను సైతం సప్లై చేశాడు. గుడిమల్కాపూర్ పిఎస్ లో బాలాజీని అరెస్టు చేసిన పోలీసులు బాలాజీ సమాచారం ద్వారా మాదాపూర్ అపార్ట్మెంట్ పై రైడ్ చేసిన పోలీసులు. నలుగురు డ్రగ్ సప్లయర్లతోపాటు, ముగ్గురు నైజీరియన్లు మరో 18 కన్జ్యూమర్ల పాత్ర కూడా ఉంది. సినిమాల్లో అవకాశం పేరుతో ఢల్లీి నుంచి ఇక్కడికి యువతులను రప్పించి వాళ్ళతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.మరో పక్క బోరబండలు గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోరబండ ప్రాంతంలోని ఇందిరానగర్ లో నివాసముండే పాత నేరస్తుడు మహమ్మద్ అజ్మత్ బాబా బుధవారం రాత్రి తన ఇంటి వద్ద గంజాయి అమ్ముతున్నాడని తెలిసి బోరబండ ఎస్సై మనోజ్ కుమార్, వేస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్సై రంజిత్ కుమార్, సిబ్బంది కలిసి పట్టుకున్నారు. అతని వద్ద చిన్నచిన్న ప్యాకెట్లలో ఉన్న గంజాయి 840 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఇతని పైన ఎన్ డి పి ఎస్ యాక్ట్ లో కేసు నమోదు చేసుకొని అరెస్టు చేసి చంచలగూడ జైలుకు తరలించారు